7/జి బృందావన్ కాలనీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Ads

సోనియా అగ‌ర్వాల్ 7/జి బృందావన్ కాలనీ చిత్రంతో అప్పట్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. వాస్తవానికి సోనియా ఈ మూవీ కన్నా ముందుగా కొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. వినీత్, అబ్బాస్ హీరోలుగా నటించిన ‘నీ ప్రేమకై’ అనే చిత్రంలో సోనియా నటించింది.

అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ని ఆకట్టుకోలేదు. ఆ తర్వాత జగపతి బాబుతో ధమ్ అనే చిత్రంలో కూడా నటించింది. అయితే ఈ మూవీ ప్లాప్ అయ్యింది. సోనియా అగ‌ర్వాల్ 2004లో విడుదల అయిన ‘7/జి బృందావన్ కాలనీ’ చిత్రంతో హిట్ ను అందుకుంది. ఈ మూవీ కోలీవుడ్ లో తెరకెక్కింది. తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమా ద్వారా సోనియా అగర్వాల్ టాలీవుడ్ కి పరిచయమయ్యింది. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో రవికృష్ణ హీరోగా నటించారు.

రవి కృష్ణ ప్రముఖ ప్రొడ్యూసర్ ఎం ఎం రత్నం కొడుకు. ఈ సినిమాలో సోనియా అగర్వాల్ తన నటనతో ఆడియెన్స్ ని ఎంతగానో  ఆకట్టుకుంది.సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఎవరి గ్రీన్ మూవీగా నిలిచింది. విభిన్నమైన లవ్ స్టోరీతో వచ్చిన ఈ మూవీతో సోనియా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. అయితే ఆమె టాలీవుడ్ లో సక్సెస్ కాలేక పోయింది.దర్శకుడు సెల్వ రాఘవన్, సోనియా మధ్య ఉన్న స్నేహం ఆ తరువాత ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలనికే ఇద్దరూ విడిపోయారు. ఇక దర్శకుడు సెల్వ రాఘవన్ హీరో ధనుష్ సోదరుడు. సోనియా అగర్వాల్ ధనుష్ కు వదిన అవుతుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం సోనియా నాలుగు పదుల వయసులో కూడా గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. ఆమె గతంలో కంటే ఇప్పుడు అందంగా, స్లిమ్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. వీటిని చూసినవారు ఈ బ్యూటీ 40 సంవత్సరాలు అంటే నమ్మరు.
Also Read: మనోజ్ టు అభిరామ్.. పెద్దవాళ్ళ సపోర్ట్ అందని 10 మంది వారసులు లిస్ట్..

Ads

 

View this post on Instagram

 

A post shared by Sonia Agarwal (@soniaaggarwal1)

Previous articleఆడపిల్లని “పదహారణాల అమ్మాయిగా” ఎందుకు కొలుస్తారు ? ఈ స్టోరీ ఏంటి ?
Next articleసత్యకృష్ణన్‌ కుమార్తెను చూశారా? హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉంది..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.