ఆడపిల్లని “పదహారణాల అమ్మాయిగా” ఎందుకు కొలుస్తారు ? ఈ స్టోరీ ఏంటి ?

Ads

ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని అంటారు. అలానే ఆడపిల్లని ఎన్నో వాటితో పోలుస్తారు. బంగారంలా ఉందని అంటారు. అందమైన పక్షిలా వర్ణిస్తారు. అలానే దేవతలతో కూడా పోలుస్తారు. ఆడపిల్లల్ని వర్ణించడానికి కొదవేలేదు. పైగా ఆడపిల్ల ఉంటే ఇంట్లో ఆనందం ఉంటుంది. ఆడపిల్ల ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో కళ కూడా ఉంటుంది.

ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోతుంది. అయితే ఆడపిల్లల్ని పదహారణాల తెలుగమ్మాయి అని కూడా అంటూ ఉంటారు. దాని వెనుక కారణం ఏమిటో మీకు తెలుసా..? ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

అసలు పదహారణాల అమ్మాయి అన్న పదం ఎలా వచ్చిందనేది చూస్తే… ఈరోజుల్లో వేలు లక్షలు కి వ్యాల్యూ ఎక్కువ. ఇప్పుడు మనకి 2000 నోట్లు 500 నోట్లు 100 నోట్లు ఇలా ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అణాలు ఉండేవి. అణా విలువ ఎంత తెలుసా.. రూపాయిలో 16వ వంతు. దీని విలువ 6.2 ఐదు పైసలు. అదే చారణ అంటే 25 పైసలు 16 అణాలు అంటే 100 పైసలు. అంటే ఒక రూపాయి. నూటికి నూరు శాతం అని కూడా దీనికి అర్థం. పదహారణాల అమ్మాయి అంటే నూటికి నూరు శాతం పరిపూర్ణంగా ఉండే అమ్మాయిలు అని అర్థం వస్తుంది. ఇలా పదహారణాల తెలుగు అమ్మాయి అనే పదం వాడుకలోకి వచ్చింది.

అందుకనే అమ్మాయిలని పదహారణాల తెలుగు అమ్మాయిని పోలుస్తారు. అలానే పదహారు అలంకారాలు కలిగి ఉండే అమ్మాయిలను కూడా పదహరణాల అమ్మాయి అంటారు. ఇక ఆ అలంకారాల గురించి చూస్తే.. నలుగుతో స్నానం, దంతధావనం, పసుపు రాసుకుని ఉండడం, చీర, రవిక, కాళ్ళకు పారాణి, పొడవాటి జుట్టు, జడ నిండా పూలు, నుదిటిన బొట్టు, బుగ్గన చుక్క, పెదాలకు ఎర్రని రంగు, పాపిట్లో కుంకుమ, కళ్ళకు కాటుక, చేతులకు గోరింటాకు, తాంబూలం. అలానే చెవిలీలు, ముక్కు పుడక, బంగారం లేదా ఏదైనా ఆభరణాలు. అదే పెళ్ళైన స్త్రీలు అయితే మంగళసూత్రం, మెట్టెలు, నల్లపూసలు వేసుకుంటారు.

Previous articleశతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్ ఈ పేర్ల వెనుక ఉన్న స్టోరీ ఏంటి ? ఎలా వచ్చాయి ?
Next article7/జి బృందావన్ కాలనీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?