సత్యకృష్ణన్‌ కుమార్తెను చూశారా? హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉంది..

Ads

నటి సత్యకృష్ణన్‌ తెలుగు సినీ పరిశ్రమలో సపోర్టింగ్‌ రోల్స్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సపాదించుకుంది. ఇప్పటి వరకు తెలుగులో దాదాపు అరవైకి పైగా సినిమాలలో నటించి మెప్పించింది.

సత్యకృష్ణన్‌ నటించిన ఆనంద్‌, సామాన్యుడు, బొమ్మరిల్లు, రెడీ, దూకుడు, ఉల్లాసంగా ఉత్సాహంగా,  బాద్‌షా, పిల్లా నువ్వులేని జీవితం, గోవిందుడు అందరివాడేలే, మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి హిట్‌ చిత్రాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ఆమె వాయిస్‌కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే మొదట్లో వరుసగా సినిమాలలో నటిస్తూ వచ్చిన సత్యకృష్ణన్‌ కొంతకాలం నుండి మాత్రం అడపాదడపా సినిమాలలో నటిస్తోంది.
ఆమె చివరిగా 10th క్లాస్‌ డైరీస్‌, ఆడవాళ్లు మీకు జోహార్లు, అమ్ము అనే చిత్రాల్లో కనిపించింది. ఆమె సామాజిక మధ్యమాలలో కూడా ఎక్కువగా యాక్టివ్‌గా ఉండట్లేదు. ఇటీవల జరిగిన కొన్ని చిత్రాల ఆడియో వేడుకలలో సత్య కృష్ణన్‌ తన కుమార్తెతో కలిసి హాజరు అయ్యింది. దాంతో తల్లి కూతుర్ల ఫొటోలు సామాజిక మధ్యమాలలో తెగ వైరల్‌ అవుతున్నాయి. కూతురు తన తల్లి సత్య కృష్ణన్‌ మించి అందంగా ఉంది. సత్య కుమార్తె పేరు అనన్యా కృష్ణన్‌. ఈ ఫోటోలు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.
అయితే అనన్యా కృష్ణన్‌ తెలుగులో ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ అనే మూవీలో ముఖ్యమైన క్యారెక్టర్ లో నటించింది. అంతేకాకుండా ‘ఊ అంటావా మావ ఉఊ అంటావా మావ’ అనే మూవీలో కూడా కీలక పాత్రలో నటించింది. అయితే అనన్య తన తల్లిలాగే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే చేస్తుందా? హీరోయిన్‌గా కూడా ఎంట్రీ ఇస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. అనన్యా కృష్ణన్‌ కు సోషల్‌ మీడియా అకౌంట్స్ లేవని సమాచారం. ఆమె ఆడియో వేడుకలు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్స్ లో కనిపిస్తోంది. ప్రస్తుతం అనన్య ఫొటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.
Also Read: ఈ 4గురు దర్శకుల కుమార్తెలు ఏం చేస్తున్నారో తెలుసా?

Ads

 

View this post on Instagram

 

A post shared by Sathya krishnan (@sathya_krishnan27)

Previous article7/జి బృందావన్ కాలనీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Next article47 సంవత్సరాల వయసులో ఆడపిల్లకు జన్మనిచ్చిన హీరోయిన్ తల్లి..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.