కైకాల సత్యనారాయణ ఆస్తులు విలువ ఎంత ఉంటుందో తెలుసా?

Ads

కొంత కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదాలు జరుగుతున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు కొన్ని నెలల క్రితం కన్నుమూయగా, నెలరోజుల క్రితం సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. వాటి నుండి టాలీవుడ్ కోలుకోక ముందే, మరో లెజెండరి యాక్టర్ కైకాల సత్యనారాయణ కన్నుమూశారన్న వార్త టాలీవుడ్ ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

సత్యనారాయణ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఫిల్మ్ నగర్ లోని తన ఇంటిలో డిసెంబర్ 23న తెల్లవారు జామున 4 గంటలకు కన్నుమూసినట్లుగా ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. ఆయన మరణంతో ఫిల్మ్ నగర్ విషాదంలో మునిగింది. ఇక ఈ క్రమంలో కైకాల సత్యనారాయణ ఆస్తుల గురించి వస్తున్న వార్తలు టాలీవుడ్ లో చర్చకు దారి తీసాయి. మరి ఆ నట సార్వబౌముడి ఆస్తులు గురించి చూద్దాం..

టాలీవుడ్ గర్వించదగ్గ నటులలో అగ్రగణ్యుడు కైకాల సత్యనారాయణ. ఎన్టీరామరావుతో సమానంగా సాంఘీక, జానపద సినిమాల్లో నటించి అందరి ప్రశంసలు పొందిన అద్భుతమైన నటుడు. సత్యనారాయణ తనదైన నటనతో, విలనిజంతో తెలుగు ఇండస్ట్రీలో ముద్రవేసారు. ఆయన చేసిన పాత్రల్లో యముడు అంటే తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు వచ్చేది కైకాల సత్యనారాయణ.

Ads

టాప్ హీరోల అందరి సినిమాల్లో విలన్ గా చేసి, నట సార్వభౌమునిగా పేరు గడించారు. ఆయన సుమారు 777 చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
ఇక సత్యనారాయణ ఆస్తుల వివరాలు చూసినట్లయితే, ప్రస్తుతం అందిన సమాచారం మేరకు ఆయనకు హైదరాబాద్ మరియు చెన్నైలో సొంత ఇళ్లు ఉన్నాయి. ఇంకా ఆయన వద్ద ఖరీదు అయిన రెండు కార్లు ఉన్నాయి. ఆ కార్లలో ఒకటి మెర్సిడెజ్ బెంజ్, దీని ధర 67 లక్షలు. రెండవ కారు ఇన్నోవా క్రిస్టా, దీని ధర 29 లక్షలు అని తెలుస్తోంది. గచ్చిబౌలిలోని నాగార్జున రెసిడెన్సీలో ఒక ఫ్లాట్ ఉన్నట్లు సమాచారం. ఆ ఫ్లాట్ ఖరీదు రూ.1.47 కోట్లని సమాచారం. కైకాల సత్యనారాయణ ఆస్తుల విలువ సుమారుగా ముప్పై కోట్లు ఉంటుందని సమాచారం.

Also Read: టాలీవుడ్ లోని ఈ 10 మంది స్టార్ హీరోల పెళ్లి పత్రికలూ ఎప్పుడైనా చూసారా?

Previous articleదర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు మూవీ తరువాత చేయబోయే సినిమా ఏమిటో తెలుసా?
Next articleజూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ లలో ఉన్న సిమిలారిటీస్ ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.