Ads
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్ నగర్ లో ఎంత ఘనంగా జరిగాయో అందరికీ తెలిసిందే. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలలో అనంత్ అంబానీ బరువును గురించి చాలామంది చర్చించుకున్నారు. ఒకప్పుడు 200 కిలోల బరువు ఉండే అనంత్ అంబానీ 18 నెలలలో 108 కేజీల బరువు తగ్గడం, మళ్లీ కొద్ది రోజులకే బరువు పెరగటంపై చాలామంది అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే అనంత్ అంబానీ బరువు తగ్గడానికి ఎంచుకున్న మార్గాలు ఏమిటి, అతను బరువు తగ్గటం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అనంత్ అంబానీ వెయిట్ లాస్ జర్నీ వెనుక ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా ఉన్నారు. ఇతను ఒక సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్. వివేక్ ఒబెరాయ్, శిల్పా శెట్టి, జాన్ అబ్రహం లాంటి సెలబ్రిటీలకి ఇతనే ఫిట్నెస్ ట్రైనర్. ఇతను అనంత్ అంబానీ బరువు తగ్గటంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు, ప్రతిదీ ప్లాన్ ప్రకారం చేశాడు. డైట్ లో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవటం కార్బోహైడ్రేడ్లు, ప్రోటీన్లు తక్కువగా ఉండేలా ప్లాన్ చేయటం, బరువు తగ్గటానికి వ్యాయామాలు చేస్తున్న సమయంలో జీరో షుగర్ డైట్ విధానాన్ని పాటించటం..
Ads
రోజూ డైట్ లో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం అలాగే బాడీ ఫిట్నెస్ కోసం రోజూ కార్డియో స్ట్రెంత్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వంటి వ్యాయామాలని అయిదు నుంచి ఆరు గంటలు చేయించేవారంట. అంతేకాకుండా ప్రతిరోజు 21 కిలోమీటర్ల నడక, యోగ వ్యాయామాలు కూడా ఫిట్నెస్ ట్రైనింగ్ లో భాగాన్ని చేశారు. అనంత్ అంబానీ కూడా అంతే అంకిత భావంతో వినోద్ చన్నా పర్యవేక్షణలో వ్యాయామాలు చేసి బరువుని తగ్గించుకున్నారు.
18 నెలలలో మొత్తం 108 కిలోల వెయిట్ లాస్ అయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే మళ్లీ అనంత్ అంబానీ బరువు పెరిగిపోవడంతో మళ్లీ ఆశ్చర్య పోవడం జనం వంతు అయింది. అయితే తను ఆస్తమా మందులు తీసుకోవడం వలన బరువు పెరిగినట్లు అనంత్ అంబానీ వివరించారు. ఏది ఏమైనా మరీ ఇంత కఠినమైన డైట్ చేయాలంటే కష్టమే మరి అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే, ఆరోగ్యం కావాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.
ALSO READ : “అనంత్ అంబానీ-రాధిక మర్చంట్” లవ్ స్టోరీ గురించి తెలుసా..? వీరి ప్రేమ కథ ఎలా మొదలయ్యింది అంటే..?