ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా వాడే “ఊతపదం” ఏంటో తెలుసా?

Ads

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు మరే సినిమాలోనూ నటించలేదు. రెండున్నర సంవత్సరాల తారక్ ఫ్యాన్స్ ఎదురుచూపులకి దేవర సినిమా రూపంలో జవాబు దొరుకుతుంది. ఈ సినిమాతో మళ్లీ పెద్ద హిట్ ని అందుకుంటాడు అని తారక్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే ఆనంద పడిపోతున్నారు. ఈ సినిమాకి ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది.

అయితే పాపం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఆఖరికి ఈ ఏడాది దసరా పండుగకి రిలీజ్ కాబోతుంది. దేవర సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ కాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ సినిమాకి మంచి అవుట్ పుట్ ఇవ్వాలని తాపత్రయపడుతున్నాడు. అలాగే దర్శకుడు కొరటాల శివ కూడా ఆచార్య సినిమాతో ఎన్నో విమర్శలు అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాతో గట్టి సమాధానం ఇవ్వాలని కసితో ఈ సినిమా చేస్తున్నారు.

Ads

ఇక ఈ సినిమా విషయం పక్కన పెడితే ఇప్పుడు ఎందుకో సడన్గా జూనియర్ ఎన్టీఆర్ ఊతపదం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అసలు తారక్ ఊతపదం ఏమిటి అనేది చూద్దాం. తారక్ షూటింగ్లో ఉన్నప్పుడు కానీ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు గానీ చాలా జోవియల్ గా ఉంటాడు. అతను ఎక్కువగా “అరే నీ..” అనే పదం ఎక్కువగా మాట్లాడుతాడంట. రోజుకి కనీసం 20 నుంచి 30 సార్లు ఈ పదం పలుకుతాడని తెలుస్తోంది.

ఇదే విషయం గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా తారక్ చెప్పినట్లు సమాచారం. తొమ్మిది భాషలలో అలవోకగా మాట్లాడగలిగే జూనియర్ ఎన్టీఆర్ అంటే యావత్ భారత దేశంలోనే కాదు ప్రపంచం వ్యాప్తంగా కూడా అతనికి డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే చాలా సంవత్సరాల క్రితం విడుదలైన బృందావనం సినిమా ని జపాన్ లో త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ మీద ఉన్న క్రేజ్ కి ఇప్పుడు ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో చూడాల్సిందే.

Previous article”కృష్ణుడి” తో జతగా రాధనే ఎందుకు పూజిస్తారు..? రుక్మిణిని ఎందుకు పూజించరు..?
Next articleఅనంత్ అంబానీ బరువు తగ్గడానికి ప్రతిరోజు ఇలాంటి ఆహారం తీసుకుంటారా..? డైట్ ఇంత కఠినంగా ఉంటుందా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.