“అనంత్ అంబానీ-రాధిక మర్చంట్” లవ్ స్టోరీ గురించి తెలుసా..? వీరి ప్రేమ కథ ఎలా మొదలయ్యింది అంటే..?

Ads

ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్ళికి ముందు జరిగే వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరు అయ్యారు.

మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకలో, ఎంతో మంది సెలబ్రిటీలు పర్ఫార్మెన్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా, ఈ జంటని ఆశీర్వదించారు. ఇప్పుడు రెండవ పెళ్లి వేడుక కూడా స్పెయిన్ లో జరుగుతోంది ఆ ఈవెంట్ కి కూడా బాలీవుడ్ ప్రముఖులు హాజరు అవుతున్నారు. ఒక షిప్ లో ఈ ఈవెంట్స్ జరుగుతాయి. అయితే, వీరిద్దరూ గత ఏడు సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్నారు. రాధిక మర్చంట్ తండ్రి వీరేన్ మర్చంట్ ఒక హెల్త్ కేర్ బ్రాండ్ సీఈవోగా ఉన్నారు.

anant ambani radhika merchant love story

రాధిక, అనంత్ చిన్నప్పటి నుండి స్నేహితులు. చిన్నతనంలో ఇద్దరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడం, ఆ తర్వాత కామన్ ఫ్రెండ్స్ ఉండడంతో వీరి స్నేహం ఇంకా పెరిగింది. ఎక్కువగా కలుస్తూ ఉండేవారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. స్కూలింగ్ అయిపోయాక రోడ్ ఐలాండ్ లో ఉన్న బ్రౌన్ యూనివర్సిటీలో పై చదువుల కోసం అనంత్ అంబానీ వెళ్లారు. రాధిక మర్చంట్ న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకున్నారు. 2018 లో వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో బయటకి రావడంతో వీరిద్దరి రిలేషన్ షిప్ మీద వార్తలు రావడం మొదలు అయ్యాయి.

gifts to ambani daughter in law

Ads

ఈ వార్తలు అక్కడితో ఆగిపోలేదు. అంబానీ ఇళ్లలో జరిగిన ప్రతి ఈవెంట్ కి రాధిక హాజరు అయ్యేవారు. ఈషా అంబానీ, ఆ తర్వాత ముఖేష్ అంబానీ మొదటి కొడుకు ఆకాష్ అంబానీ పెళ్లికి కూడా రాధిక హాజరు అయ్యారు. అప్పుడు, “అంబానీ ఈవెంట్స్ లో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరు?” అని ఆసక్తి చూసిన అందరిలో నెలకొంది. రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయంలో వీరిద్దరి రోకా వేడుక జరిగింది. ఉత్తరాది వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఇది ఒక ఎంగేజ్మెంట్ లాంటిది. ఇద్దరు వ్యక్తులు తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకువెళ్లాలి అనే విషయాన్ని తెలుపుతూ దేవుడి ఆశీస్సులు తీసుకుంటారు.

ఈ వేడుకలో కేవలం అంబానీ, మర్చంట్ కుటుంబానికి చెందిన దగ్గరి వాళ్ళు మాత్రమే హాజరు అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఘనంగా పెళ్లికి ముందు జరిగే వేడుకలని జరిపారు. అంతర్జాతీయ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరు అయ్యారు. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం అంతా కూడా మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుక గురించి మాట్లాడుకున్నారు. ఈ వేడుకకి దాదాపు 1200 కోట్ల ఖర్చు అయినట్టు సమాచారం. పెళ్లి కూడా ఇంతే ఘనంగా జరుపుతారు.

ALSO READ : ఆశ చాక్లెట్ కంపెనీ ఎందుకు మూత పడిందో తెలుసా..? ఒకప్పుడు ఎంతో ఇష్టంగా తిన్నాము…కానీ.?

Previous articleఅచ్చం ప్రభాస్ లాగే ఉన్న ఈ ఫోటోలోని వ్యక్తి కూడా ఒక నటుడే.. అతను ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Next articleసమాజంలో మగవాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఇవే..! ఇన్ని ఇబ్బందులు పడుతున్నారా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.