బుల్లితెర స్టార్ యాంకర్ సుమ అరుదైన ఫోటో గ్యాలరీ..

Ads

టెలివిజన్ యాంకర్ సుమ అందరికి సూపరిచితమే. బుల్లితెర నుండి వెండితెర వరకు ప్రతి ఒక్కరికీ తెలిసిన యాంకర్ సుమ. ఆమె స్టార్ మహిళతో ప్రతీ ఇంట్లోను ఆమె కూడా ఇంటి మనిషిలా మారిపోయిందని చెప్పవచ్చు. మలయాళీ అమ్మాయి అయినా ఆమె తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. చలాకి తనం, ఎనర్జీ, సమయస్ఫూర్తి, భాష పై పట్టు,ఇలా అన్ని కలిపితే యాంకర్ సుమ అనవచ్చు.

Ads

ఆమె యాంకర్ గా కెరీర్ ప్రారంభించి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా సుమ స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది. సుమకు ప్రస్తుతం 45 ఏళ్ళు, అయినప్పటికీ ఆమెకు పోటీ లేదు. టాలీవుడ్ లో ఏ పెద్ద ఈవెంట్స్, స్టార్ హీరో మూవీ ఈవెంట్స్ జరగాలన్నా అక్కడ యాంకర్ గా సుమ ఉంటుదని చెప్పవచ్చు. సుమకు తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళ, మలయాళ భాషల పై మంచి పట్టు వుంది.కొత్త యాంకర్లు ఎంతోమంది వచ్చినప్పటికీ, సుమ రేంజ్ ను ఎవరూ టచ్ చేయలేకపోయారు. సుమతో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన చాలా మంది అలా కొనసాగలేకపోయారు. ఆమె ఇప్పటి జనరేషన్ యాంకర్స్ కి గట్టి పోటీ ఇస్తూ ముందుకెళ్తోంది. ఇకపై సుమ లాంటి యాంకర్ వస్తుందో లేదో కూడా సందేహమే. యాకర్స్ ఎంతమంది ఉన్నప్పటికి సుమ కనకాల ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు.
సుమ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలిరోజుల్లో కొన్ని సీరియల్స్ లో నటించింది. ఆ తరువాత దర్శకుడు దాసరి నారాయణ రావు తెరకెక్కించిన ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే చిత్రంలో హీరోయిన్‌గా కూడా సుమ నటించింది. ఆ తరువాత యాంకర్ గా మారిన సుమకు ఇప్పటి వరకు వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.యాంకర్ సుమకు సంబంధించి కొన్ని అరుదైన మరియు ఇప్పటి వరకు చూడని ఫోటోలను ఇప్పుడు చూద్దాం..
1.
2.3.4.567.8.9.10.11.12.Also read: వేదం మూవీలో ‘కర్పూరం’ క్యారెక్టర్ చేసింది ఎవ‌రో తెలుసా?

Previous articleతెలుగు ఇండస్ట్రీలో ఉన్న 27 సెలబ్రిటీల బ్రదర్ అండ్ సిస్టర్స్..
Next articleరియల్ హీరో సోనూ సూద్ గురించిన ఆసక్తికర విషయాలు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.