Ads
అఆ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు అనుపమ పరమేశ్వరన్. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు మళ్ళీ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాలో నటించారు.
ఈ సినిమా డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా రూపొందింది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. మొదటి భాగంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించారు. ఇప్పుడు ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇందులో అనుపమ, లిల్లీ అనే పాత్రలో నటిస్తున్నారు అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. హీరోగా మాత్రం సిద్ధూ నటిస్తున్నారు. మొదటి భాగానికి కొనసాగింపుగానే ఇది సాగుతోంది. కాకపోతే కథ మాత్రం డిఫరెంట్ గానే ఉంటుంది అని ఇది చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా, వాయిదా పడి మార్చి 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకి వస్తోంది. డీజే టిల్లు సినిమా చాలా పెద్ద హిట్ అవ్వడంతో, ఈ సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.
Ads
ఆలస్యానికి కారణం, మధ్యలో వేరే సినిమాలు రావడం కొంత వరకు అయితే, సినిమా విషయంలో కూడా కొన్ని మార్పులు జరిగి, ఇంకా బాగా తీయాలి అనే ఉద్దేశంతో కొన్ని సీన్స్ రీ షూట్ చేశారు అని, అందుకే ఆలస్యమైంది అని అంటున్నారు. ట్రైలర్ కూడా చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అయితే, ఈ సినిమా కోసం అనుపమ పరమేశ్వరన్ తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా భారీ మొత్తంలోనే ఉన్నట్టు సమాచారం. సాధారణంగా అనుపమ సినిమాకి కోటి నుండి కోటిన్నర రూపాయల వరకు తీసుకుంటారు.
కానీ ఈ సినిమా కోసం రెండు కోట్ల నుండి రెండున్నర కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. ఇది అనుపమ కెరీర్ లోనే ఇప్పటి వరకు హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని అంటున్నారు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో అనుపమ కనిపిస్తున్నారు. పాత్రకి, పాత్రకి వేరియేషన్ ఉన్న సినిమాలని మాత్రమే చేస్తూ వస్తున్న అనుపమ, ఈ సినిమాలో కూడా అలాంటి ఒక పాత్ర పోషించారు.
ALSO READ : నందమూరి హీరో “కళ్యాణ చక్రవర్తి” గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?