“దీపికా పదుకొనే” చేసిన దాంట్లో ఏం తప్పు ఉంది..? ఎందుకు ఇలా అంటున్నారు..?

Ads

ప్రముఖ నటి దీపికా పదుకొనే దాదాపు 6 సంవత్సరాల క్రితం రణవీర్ సింగ్ పెళ్లి చేసుకున్నారు. ఇవాళ వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీపికా పదుకొనే చేతిలో ఇప్పటికి కూడా సినిమాలు ఉన్నాయి. వీరిద్దరి పెళ్లి జరిగి 5 సంవత్సరాలు అయ్యింది. ఈ సంవత్సరంతో 6 సంవత్సరాలు పూర్తవుతాయి.

అయితే, ఈ 5 సంవత్సరాల సమయంలో వీరిని పిల్లల గురించి అడిగిన వారు ఎంతో మంది ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా దీపికా పదుకొనేని తిట్టిన వారు కూడా చాలా మంది ఉన్నారు. “ఇప్పటి వరకు పిల్లలు కనకపోవడం ఏంటి?” అంటూ కామెంట్స్ కూడా చేశారు. అయితే, “ఎవరిష్టం వారిది” అని దీపికా పదుకొనేకి మద్దతు తెలిపిన వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు.

comments on deepika padukone

Ads

దీపికా పదుకొనే ఒకరకంగా చెప్పాలి అంటే పెళ్లి తర్వాత ఇంకా పెద్ద స్థాయికి వెళ్లారు. కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల సినిమాలు హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీపికా పదుకొనే దుస్తుల విషయంలో కూడా అలానే కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా అయితే కామెంట్స్ ఎదుర్కొంటారో, అన్ని రకాల కామెంట్స్ దీపికా పదుకొనే ఎదుర్కొన్నారు. రణవీర్ సింగ్ మీద తక్కువ కామెంట్స్ వచ్చాయి అని కాదు. కానీ దీపికా పదుకొనే మీద ఎన్ని కామెంట్స్ వచ్చాయో అన్ని కామెంట్స్ అయితే రణవీర్ సింగ్ మీద రాలేదు.

“మీ భర్త మిమ్మల్ని సినిమాలు చేయడానికి పర్మిషన్ ఇస్తున్నారా?” అని దీపికా పదుకొనేని అడిగిన వారు కూడా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించడంతో, కొంత మంది సంతోషించారు. కానీ ఎక్కడో కొంత మంది, “ఇన్ని సంవత్సరాలకి పిల్లలని కంటున్నారా?” అంటూ అడుగుతున్న వారు కూడా అన్నారు. అసలు దీపికా పదుకొనే చేసిన దాంట్లో తప్పు ఏంటి? ఆమెకి నచ్చిన సమయంలో ఆమె పిల్లల్ని కంటే కూడా ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏం ఉంది? ఇవన్నీ మాట్లాడే వారికే తెలియాలి.

ALSO READ : “పవన్ కళ్యాణ్” కి ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా..? కానీ సినిమాల సమయంలో..?

Previous articleఆపరేషన్ వాలెంటైన్ సెన్సార్ టాక్..! ఎలా ఉందంటే..?
Next articleటిల్లు స్క్వేర్ సినిమా కోసం “అనుపమ పరమేశ్వరన్” తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?