ఆగష్టు 15, జనవరి 26న జాతీయ జెండాని ఎగురవేయడం మధ్య ఇంత తేడా ఉందా..? మీకు తెలుసా..?

Ads

మన భారత దేశంలో జాతీయ జెండా ని ప్రతి ఏడూ రెండు సార్లు ఎగరవేస్తాము. ఒకటి ఆగస్టు 15. ఇంకొకటి జనవరి 26. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు అనగా ఆగస్టు 15న జెండాని ఎగురవేస్తాము. అలానే రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న జాతీయ జెండాను ఎగరవేస్తాము. ఈ రెండు సార్లు కూడా జెండాని ఒకే విధంగా ఎగరవేస్తాము అనుకుంటే పొరపాటే.

జాతీయ జెండాను ఈ రెండు సందర్భాల్లో ఎగరవేయడంలో తేడాలు ఉన్నాయి. మరి ఆ తేడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్వాతంత్య్ర దినోత్సవం నాడు జెండా ని ఎలా ఎగురవేయాలి..?

ముందుగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు జెండా ని ఎలా ఎగరవేస్తాము అనేది చూద్దాం. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ జెండా ని కర్ర కింద కడతారు. ఒక తాడుతో జెండాని కింద నుండి పైకి లాగుతారు. కర్ర పైకి జెండా వెళ్ళిన తర్వాత తాడును లాగి జెండాని విప్పుతారు. దీనిని జెండా ఎగరవేయడం అని అంటాము. మన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేస్తాము. ఇంగ్లీషులో దీనిని ఫ్లాగ్ హోస్టింగ్ అని అంటారు.

Ads

గణతంత్ర దినోత్సవం నాడు జెండా ని ఎలా ఎగురవేయాలి..?

గణతంత్ర దినోత్సవం నాడు జెండా ని కర్ర పై భాగంలో కడతారు. తాడు తో దానిని విప్పి ఆవిష్కరిస్తారు. ఫ్లాగ్ అన్ ఫర్ల్ అంటారు అని అంటారు దీన్ని.

దేశ ప్రధానమంత్రి జాతీయ జెండాను స్వాతంత్ర దినోత్సవం నాడు ఆవిష్కరిస్తారు. మనకి స్వాతంత్రం వచ్చినప్పటికి రాజ్యాంగం అమలులోకి రాలేదు. అంటే అప్పుడు రాష్ట్రపతి లేరు. ఈ కారణంగానే ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు. దేశంలో రాజ్యాంగం అమలుకు గుర్తుగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుతాము. అందుకే ఆ రోజున రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగుర వేస్తారు.

Previous articleరాజులని ఆకర్షించేందుకు రాణీలు వారి అందాన్ని ఇలా పెంచుకునేవారని.. మీకు తెలుసా..?
Next articleచెడు శక్తులు పోయి సమస్యలేమీ లేకుండా ఉండాలంటే… ఇలా హనుమంతుడిని పూజించండి..!