Ads
సోషల్ మీడియాలో ప్రస్తుతం భూమా మౌనిక పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మంచు మనోజ్, భూమా మౌనికల వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Ads
మనోజ్, మౌనిక జంట బాగుందని కామెంట్లు చేస్తున్నారు. ఇక భూమా మౌనిక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే భూమా మౌనిక ఆస్తుల విలువ దాదాపు 2000 కోట్లు అని సమాచారం. భూమా మౌనికకు మంచు మనోజ్ తో రెండవ పెళ్లి అని తెలిసిందే. అయితే ఆమె మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ క్రమంలో మొదటి భర్త ఆమెకు భరణంగా 250 కోట్ల రూపాయలు ఇచ్చారని తెలుస్తోంది. అంతే కాకుండా ఆమె పేరు మీద కమర్షియల్ ప్రాపర్టీస్ చాలానే ఉన్నాయని సమాచారం.
మౌనీక పేరు పై ఆళ్లగడ్డ, కర్నూలు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఇక భూమా మౌనికకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవని తెలుస్తోంది. మంచు మనోజ్, భూమా మౌనిక గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారని సమాచారం. గతంలో ఎన్నో సందర్భాల్లో మనోజ్ రెండో వివాహం గురించి ఖండించారు. కానీ భూమా మౌనిక గురించి మీడియాలో వచ్చినపుడు మాత్రం ఆయన స్పందించలేదనే విషయం అందరికి తెలిసిందే.
ఇక పై మనోజ్, మౌనికలు ఒకరికొకరు వారి కెరీర్ విషయంలో సహాయం చేసుకోనున్నారని తెలుస్తోంది. మంచు మనోజ్ సినిమాల్లో ముందుకు వెళ్లే దిశలో ఆలోచిస్తుండగా, మౌనిక రాజకీయాల పై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాల లకు సంబంధించిన వివరాలు రాబోయే రోజుల్లో తెలిసే ఛాన్స్ ఉంది. మంచు మనోజ్ తో వివాహం అనంతరం భూమా మౌనికకు సామాజిక మధ్యమాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది.
ఇక మనోజ్ మరి కొన్ని రోజులలో క్రేజీ ప్రాజెక్ట్ లతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. మంచు మనోజ్ ‘వాట్ ద ఫిష్’ అనే చిత్రంతో రానున్నారు. అయితే ఈ మూవీ విడుదల తేదీ పై వంక స్పష్టత రాలేదు. ఈ చిత్రం విజయం సాధిస్తే మంచు మనోజ్ పారితోషికం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక పై మనోజ్ కెరీర్ లో విజయం సాదించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: మంచు మనోజ్ పెళ్లి ఆ స్టార్ హీరోయిన్ లాగే చేసుకున్నాడా?