47 సంవత్సరాల వయసులో ఆడపిల్లకు జన్మనిచ్చిన హీరోయిన్ తల్లి..

Ads

సినీ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. సినిమాలో చూపించిన కల్పితమైన  స్టోరి నిజ జీవితంలో జరగడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ప్రముఖ బుల్లితెర నటి మరియు సీరియల్ హీరోయిన్‌ తల్లి ఇరవై మూడు ఏళ్ల తరువాత ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన కేరళలో జరిగింది. దాంతో ఈ న్యూస్ ఇటు సినీ ఇండస్ట్రీలో, అటు సామాజిక మధ్యమాలలో హాట్‌టాపిక్‌గా మారింది.

ఇక వివరాలలోకి వెళ్తే, 23 సంవత్సరాల ఆర్య పార్వతి మలయాళంలో ఎంతో పాపులారిటి ఉన్న నటి. ఆమె చాలా బుల్లితెర సీరియల్స్‌లో ప్రధాన పాత్రలో నటిస్తూ మలయాళ టెలివిజన్ హీరోయిన్ గా  క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆమె ఇలయవళ్ గాయత్రి, చెంబట్టు లాంటి సీరియల్స్‌ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. పార్వతి నటి మాత్రమే కాకుండా మంచి క్లాసికల్‌ డ్యాన్సర్‌. ఆమె నటిగా, డ్యాన్సర్‌గా ఎంతగానో బిజీగా ఉన్నప్పటికి కూడా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.
ఆమె పర్సనల్ విషయాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తన తల్లి గర్భవతి అయినట్లు గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికి షాకిచ్చింది. 47 సంవత్సరాల ఆమె తల్లి ఇరవై మూడు ఏళ్ల తరువాత గర్భవతి అవడంతో ఆ విషయం తెలిసి తెలిసి అందరు ఆశ్చర్యపోయారు. అయితే ఆమె తల్లి తాజాగా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.
ఇక ఈ విషయాన్ని ఆర్య పార్వతి నెట్టింట్లో షేర్‌ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా ఆమె  తన తల్లి, పుట్టిన బేబీ ఫొటోలను మరియు వీడియోలను తన అకౌంట్ లో షేర్‌ చేసింది. అయితే ఇలాంటి సంఘటన స్పూర్తిగా ఈ మధ్యే కోలీవుడ్ లో ఒక చిత్రం తెరకెక్కింది. ఆర్‌జే బాలాజీ ప్రధాన పాత్రలో ‘వీట్ల విశేషం’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమాలో కట్టప్ప సత్యరాజ్‌, ఊర్వశీలు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీలో హీరో తల్లిగా నటించిన ఊర్వశీ కూడా మధ్య వయసులో గర్భవతి అవుతుంది. ప్రస్తుతం అలాంటి ఇన్సిడెంట్ రియల్ లైఫ్ లో జరగింది.
Also Read: ప్రేమికుడు మూవీ షూటింగ్ ను మధ్యలోనే ఆపాలని గవర్నర్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసా?

Ads

Previous articleసత్యకృష్ణన్‌ కుమార్తెను చూశారా? హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉంది..
Next articleభూమా మౌనిక రెడ్డి ఆస్తుల విలువ ఎంతనో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.