Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల అయ్యి రెండు సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ విడుదల అయినప్పుడు వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. సినిమా టైటిల్ సాంగ్ స్టార్టింగ్ లో ఒక సాకీ వస్తుంది. ఒక పెద్ద వ్యక్తి కిన్నర పట్టుకొని వాయిస్తూ పాడుతూ ఉంటారు. పాట విడుదల అయిన తర్వాత ఆ వ్యక్తి గురించి అందరూ తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఆయన పేరు దర్శనం మొగిలయ్య. ఒకే ఒక్క పాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయారు.
ఆయన వివరాలు ఏంటి అనేది అందరికీ తెలిసింది. ఆయనకి ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పాట తర్వాత దర్శనం మొగిలయ్య జీవితం మారిపోతుంది అని అందరూ అనుకున్నారు. ఇటీవల పద్మశ్రీ కూడా ప్రకటించారు. దాంతో చాలా మంది సంతోషించారు. అన్ని సంవత్సరాల నుండి ఆయన కిన్నర వాయిస్తూ తనని తాను నిరూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నానికి ఇప్పుడు ప్రతిఫలం దొరికింది అని సంతోషపడ్డారు. అయితే ఇటీవల ఆయన ఫోటోలు బయటికి వచ్చాయి.
అందులో మొగిలయ్య రోజు వారి కూలిగా పని చేస్తున్నట్టు తెలిసింది. పద్మశ్రీ వచ్చిన తర్వాత అప్పటి సర్కారు మొగిలయ్యకి కోటి రూపాయల గ్రాంట్ తో పాటు, 600 చదరపు గజాల స్థలం కూడా ఇచ్చింది. అయినా కూడా ఇప్పటికి మొగిలయ్యకి పని చేయాల్సిన అవసరం ఏంటి అని అందరూ అనుకున్నారు. ఈనాడు కథనం ప్రకారం, ఈ విషయంపై మొగిలయ్య ఈనాడు వాళ్లతో మాట్లాడుతూ, తనకి కోటి రూపాయలు వచ్చినా కూడా ఇంటి స్థలం ఇవ్వలేదు అని చెప్పారు.
Ads
తనకి వచ్చిన కోటి రూపాయలతో తుర్కయంజాల్ లో 95 చదరపు గజాల స్థలం కొనుగోలు చేశాను అని, దాని ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు అని చెప్పారు. అది కూడా చాలకపోవడంతో అసంతృప్తిగా ఉంది అని మొగిలయ్య తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి తన పరిస్థితి చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించినట్టు మొగిలయ్య తెలిపారు. ఈ విషయం మీద భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, మొగిలయ్యకి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేసింది అని చెప్పారు.
ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు కూడా నెల నెల 10 వేల రూపాయల పెన్షన్ ఇచ్చినట్టు తెలిపారు. మొగిలయ్యకి 9 మంది సంతానం. వారిలో ఒక కొడుకుకి మందులు కొనాలి అంటే నెలకి 7000 రూపాయలు ఖర్చు అవుతాయట. ఈ కారణంగానే మొగిలయ్య పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయం కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో కేటీఆర్ కూడా స్పందించి, మొగిలయ్య కుటుంబానికి జాగ్రత్తలు తీసుకుంటాం అని తెలిపారు. అంతే కాకుండా తన టీం మొగిలయ్యని కలుస్తారు అని తెలిపారు.
Thanks Sucheta Ji for bringing this news to my attention
I will personally take care of Sri Moguliah’s family. My team @KTRoffice will reach out to him immediately https://t.co/xV4NjXtik6
— KTR (@KTRBRS) May 3, 2024
ALSO READ : యూట్యూబ్ నుండి వెండితెరకు వచ్చి సక్సెస్ అయిన 8 మంది యూట్యూబర్లు