ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయినా కూడా ఇప్పటికీ అదే క్రేజ్..! ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టగలరా..?

Ads

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకి సమయం తక్కువ అని అంటారు. అంటే ఒక ఏజ్ వరకు మాత్రమే హీరోయిన్స్, హీరోయిన్ పాత్రలు చేయగలుగుతారు. ఆ తర్వాత సైడ్ రోల్స్ చేస్తూ వస్తారు. లేదు అంటే ఇండస్ట్రీకి దూరం అవుతారు. కానీ ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయినా కూడా హీరోయిన్ పాత్రలు చేయాలి అంటే మాత్రం అది కేవలం కొంత మందికి మాత్రమే సాధ్యం అవుతుంది. అలా ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ ఒక హీరోయిన్ లీడ్ రోల్స్ లో చేస్తున్నారు.

ఆ హీరోయిన్ ఇవాళ తన 41 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించి, తెలుగు సినిమాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు త్రిష. కొన్ని సంవత్సరాలు తెలుగు సినిమాల్లో చాలా ఎక్కువగా నటించిన త్రిష, మధ్యలో కొంత కాలం బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ పాత్రలో త్రిష నటిస్తున్నారు. తమిళ్ లో అయితే ఇప్పటికి కూడా త్రిష సినిమాలతో బిజీగా ఉన్నారు.

Ads

ఇటీవల లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇప్పుడు అజిత్ హీరోగా నటిస్తున్న సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతేకాకుండా కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న థగ్ లైఫ్ సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలుగులో నీ మనసు నాకు తెలుసు త్రిష మొదటి సినిమా. ఈ సినిమాతోనే త్రిష చాలా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత వర్షం సినిమాలో నటించారు. ఆ తర్వాత అందరు పెద్ద హీరోల సినిమాలలోనూ త్రిష నటించారు. త్రిష మళ్లీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమాలో నటిస్తున్నారు.

ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ దశలో ఉంది. సల్మాన్ ఖాన్ హీరోగా రాబోతున్న ఒక సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా నటిస్తారు అనే వార్త వస్తోంది. మరి అందులో ఎంత వరకు నిజం ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. త్రిష ఇవాళ తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దాంతో సోషల్ మీడియా అంతటా కూడా త్రిష పుట్టినరోజు సందర్భంగా అందరూ విష్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. సెలబ్రిటీలతో పాటు, అభిమానులు కూడా త్రిషకి పుట్టినరోజు విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : యూట్యూబ్‌ నుండి వెండితెరకు వచ్చి సక్సెస్ అయిన 8 మంది యూట్యూబర్లు

Previous article73 సంవత్సరాల వయసులో మొగిలయ్య కష్టపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? కారణం ఏంటంటే..?
Next articleరెండవ పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం లోకి మారిన ఈ రాణి ఎవరో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.