Ads
మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆయనకున్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. మెగాస్టార్ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇక అప్పట్లో చిరంజీవి మూవీ రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ చేసే హంగామాఅంతా ఇంతా కాదు. ప్రస్తుతం అదే క్రేజ్ ఉన్నా, ఒకప్పుడు మెగాస్టార్ ఆయనకి ఆయనే సాటి. మెగస్టార్ మూవీ విడుదల అంటే పండగ వచ్చినట్టుగా ఉండేది. ఇక ఆయన చేసిన చిత్రాల్లో ఎక్కువగా హిట్లే ఉన్నాయి. చిరంజీవి నటించిన చిత్రాల్లో మర్చిపోలేని సినిమా అంటే పసివాడి ప్రాణం అని చెప్పవచ్చు.మెగాస్టార్ నటించిన చిత్రాల్లో ‘పసివాడు ప్రాణం’ ఎవర్ గ్రీన్ మూవీ. ఇక ఈ సినిమాలో పసివాడిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కి కూడా చాలా మంచి పేరు వచ్చింది. చిరంజీవి వన్ మ్యాన్ షోగా చేసిన ఈ మూవీ చిన్న పిల్లవాడి కోసం ఆయన చేసిన సాహసాలు, ఎమోషనల్ సన్నివేశాలు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. ప్రధానంగా ఈ మూవీకి చక్రవర్తి అందించిన మ్యూజిక్ కూడా బాగుంటుంది. కొండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 1987లో విడుదల అయ్యింది. ‘పసివాడు ప్రాణం’ సినిమా అప్పట్లో ఒక సంచలనం. టీవీలో వస్తే ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు.
Ads
ఈ మూవీ స్టోరీ రాజా అనే చిన్నపిల్లాడి చుట్టూ తిరుగుతుంది. ఆ సినిమా చూసినంత సేపు ఆ బాబు యాక్టింగ్ సూపర్ అనకుండా ఉండలేరు. అయితే ఆ పాత్ర చేసింది బాబు కాదు, పాప. ఇక ఆ పాప అందరికి బాగా తెలిసిన నటి సుజిత. ప్రస్తుతం సుజిత టీవీ సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ఆడియెన్స్ కి దగ్గరైంది. సుజిత చాలా సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. సమరసింహారెడ్డి, ఆజాద్, గోరింటాకు ఇలా అన్ని భాషల్లోనూ కలిపి వందకు పైగా చిత్రాల్లో నటించింది.
అంతేకాకుండా సుజిత మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవ మూవీలో ఆయన చెల్లెలి పాత్రలో నటించారు. ఇక పసివాడి ప్రాణం చిత్రం కొన్ని భాషల్లో రీమేక్ కాగా, అయితే మూడు భాషల్లోనూ పిల్లాడిగా ఆ సినిమాల్లో బేబీ సుజితనే తీసుకున్నారు.
Also Read:మెగాస్టార్ టు వైష్ణవ్ తేజ్.. హిట్ కోసం వెయిట్ చేస్తున్న 10 టాలీవుడ్ హీరోలు..