మెగాస్టార్ టు వైష్ణవ్ తేజ్.. హిట్ కోసం వెయిట్ చేస్తున్న 10 టాలీవుడ్ హీరోలు..

Ads

ఈ ఏడాది సినిమాల ఫలితాల లెక్కలు మారిపోయాయి. అంటే ఒక సినిమా హిట్ అయ్యిందని లేదా ప్లాప్ అయ్యిందని నిర్దేశించే లెక్కలు చాలా మారాయి. ప్రస్తుత కాలంలో సినిమా యావరేజ్ గా ఉంటే ఆడియెన్స్ చూడట్లేదని అందరు అంటున్నారు.

Ads

వాస్తవానికి మూవీ ప్రమోషన్స్ తో ఎంతో అట్రాక్ట్ చేసినా కూడా, సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే తప్ప ఆడియెన్స్ థియేటర్లకు రావట్లేదు. సినిమకు ఫైనల్ గా పాజిటివ్ టాక్ రావాలన్నదే ఇక్కడ ముఖ్యమైన విషయం. అలా రాలేదంటే సాయంత్రం షోకే ఖాళీ అయిపోతున్నయి థియేటర్లు. ఇక దీనివల్లే ఈ ఏడాది స్టార్ హీరోల ట్రాక్ రికార్డ్స్ కూడా మారిపోయాయి. ఇక కొందరు హీరోలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ, ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అయితే మరికొందరు హీరోలు వరుస అపజేయలతో సతమతమవుతూ, కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఆ హీరోలు ఎవరో చూద్దాం రండి..
1) మెగాస్టార్ చిరంజీవి :
సైరా, గాడ్ ఫాదర్ సినిమాలు యావరేజ్ గా నిలిచినా, కొరటాల డైరెక్షన్ లో వచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మెగాస్టార్ కు ఆ స్థాయిలోనే బ్లాక్ బస్టర్ సినిమా రావాలి. చిరంజీవి రాబోయే సినిమాలు వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ లలో ఒక్కటైనా హిట్ అయ్యి, మెగాస్టార్ కి కం బ్యాక్ ఇస్తుందో చూడాలి.
2) రవితేజ :
నాలుగు ప్లాపుల తరువాత రవితేజ క్రాక్ సినిమాతో తో హిట్ అందుకున్నాడు. కానీ తరువాత రిలీజ్ అయిన ఖిలాడి,రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. రవితేజ రాబోయే సినిమాలు ధమాకా,టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాల్లో ఏదో ఒకటి బ్లాక్ బస్టర్ అయితే ఆయన ఫామ్ లోకి వస్తాడు.
3) నాగార్జున :
నాగార్జున బంగార్రాజు హిట్ అయిన తరువాత వైల్డ్ డాగ్, ఘోస్ట్ సినిమాలు అపజయం పొందాయి.ఇక వాటిని మర్చిపోవాలంటే నాగార్జున హిట్ కొట్టాల్సిందే.
4) విజయ్ దేవరకొండ :
రౌడీ హీరోకి డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలు వరుసగా డిజాస్టర్లు అయ్యాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు కూడా ఒక సాలిడ్ హిట్ కావాలి.
5) నాని:
హీరో నాని నటించిన ‘అంటే సుందరానికి’ సినిమాను మంచి మూవీ అనిపించుకుంది. అయితే మంచి కలెక్షన్స్ తబట్టలేకపోయింది. ఇక నాని కూడా ఒక హిట్ తో కంబ్యాక్ ఇవ్వాలి.
6) ప్రభాస్ :
సాహో,రాధే శ్యామ్ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచి, ప్రభాస్ ఫ్యాన్స్ కు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఎలాగైనా హిట్ ఇవ్వాల్సిన పరిస్థితి.
7) నాగ చైతన్య :
థాంక్యూ సినిమాతో నాగ చైతన్య డిజాస్టర్ అందుకున్నాడు. అతనికి ఇప్పుడు దాన్ని మర్చిపోయేలాంటి హిట్ అవసరం.
8) రానా :
రానా దగ్గుబాటి హిట్ ఇచ్చి చాలాకాలం అయిందనే చెప్పాలి. రానా విరాట పర్వం,అరణ్య అపజయాన్ని మరిపించే బ్లాక్ బస్టర్ కొట్టాలి.
9) వైష్ణవ్ తేజ్ :
వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో, ఆ తరువాత వచ్చిన కొండపొలం,రంగ రంగ వైభవంగా సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ప్రస్తుతం అతను ఫామ్ లోకి రావాలంటే హిట్ కొట్టాల్సిందే.
10) సాయి తేజ్ :
సాయి తేజ్ ను రిపబ్లిక్ సినిమా ఫలితం చాలా నిరాశ పరిచింది. ఇక తేజుకి కూడా హిట్ అవసరమే.

Also Read: తెలుగు ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే బెస్ట్ పెయిర్ అనిపించుకున్న 14 జంటలు ఎవరో తెలుసా?

Previous articleభారీగా రెమ్యూనరేషన్ పెంచిన అడివి శేష్..
Next articleరెండు పెళ్లిళ్లు చేసుకున్న సినీ నటులు ఎవరో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.