పవన్ నటించిన లాస్ట్ ఫైవ్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Ads

అభిమానుల్లో పూనకం తెప్పించే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ పేరుకే ఒక బ్రాండ్ ఉంది అని అతని అభిమానులు ఫీల్ అవుతారు. సినీ ఇండస్ట్రీలో హిట్ ,ఫ్లాప్ తో సంబంధం లేకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం అతను నటించిన బ్రో చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంతకు ముందు అతని నటించిన ఐదు చిత్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ డీటెయిల్స్ తెలుసుకుందాం..

భీమ్లా నాయక్:

పవన్ కళ్యాణ్ హీరోగా విడుదలైన ఈ చిత్రం సుమారు
రూ. 106.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన ఈ మూవీ తొలి రోజు రూ. 26.42 కోట్ల షేర్ రాబట్టింది.

కాటమ రాయుడు :

పవన్ కళ్యాణ్ శృతిహాసన్ కాంబినేషన్లో వచ్చిన కాటమరాయుడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 84.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిపింది. తొలి రోజు . 22.27 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.

సర్ధార్ గబ్బర్ సింగ్ :

Sardaar Gabbar Singh (2016) | Cinema Chaat

Ads

పవన్ కళ్యాణ్ , బాబీకేఎస్ రవీందర్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 87.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. తొలి రోజు ఇరు తెలుగు రాష్ట్రాలలో రూ. 21.70 కోట్ల షేర్ సాధించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

అజ్ఞాతవాసి

పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి ఓవరాల్ గా 123.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ దక్కించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో తొలిరోజు . 26.40 కోట్ల షేర్ సాధించిన బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఢమాల్ అయింది.

వకీల్ సాబ్:

త్రీ ఇయర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం ఫస్ట్ డే . రూ.32.24కోట్ల షేర్స్ రాబట్టడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

బ్రో:

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ కాంబినేషన్లో లేటెస్ట్ గా విడుదలైన బ్రో చిత్రం మొదటి రోజు రూ. 23.61 కోట్ల షేర్స్ రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం బాగానే నడుస్తున్న ఈ చిత్రం హిట్ కావాలి అంటే సుమారు రూ. 98.50 కోట్లు రాబట్టాల్సి ఉంది.

 

Previous articleబ్రో మూవీ టైటిల్ వెనక ఇంత కథ ఉందా?
Next articleఈ ఏడాది హిట్ ,ఫ్లాప్ తో సంబంధం లేకుండా మొదటి రోజు కలెక్షన్స్ తో మారుమోగిన చిత్రాలు ఇవే…