ఈ ఏడాది హిట్ ,ఫ్లాప్ తో సంబంధం లేకుండా మొదటి రోజు కలెక్షన్స్ తో మారుమోగిన చిత్రాలు ఇవే…

Ads

ఈ సంవత్సరం టాలీవుడ్ లో విడుదలైన పలు చిత్రాలు హిట్ ,ఫ్లాఫ్ తో సంబంధం లేకుండా మొదటిరోజు కలెక్షన్స్ ఇరగదీసాయి. వీటిలో కొన్ని అదే పరంపర చివరి వరకు కంటిన్యూ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిస్తే మరికొన్ని వారం గడవక ముందే చతుకులబడ్డాయి. ఆది పురుష్ దగ్గర నుంచి బ్రో తో సహా ఫస్ట్ డే కలెక్షన్స్ మోత మోగించిన సినిమాలు ఏవో చూద్దాం…

సార్

ధనుష్ హీరోగా నటించిన సార్ చిత్రం మొదటి రోజు రూ. 2.65 కోట్ల షేర్ సొంతం చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

వారసుడు


తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన వారసుడు చిత్రం తొలి రోజు రూ. 3.10 కోట్ల షేర్ రాబట్టింది. ఆ తర్వాత కూడా నిలకడగా ఆడి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

వాల్తేరు వీరయ్య


చిరంజీవి రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మీరు తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ డే . 22.90 కోట్ల షేర్ సాధించడమే కాకుండా ఆల్ టైం హిట్ గా నిలిచింది.

వీర సింహారెడ్డి


బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వీరవిహారం చేసింది. 25.35 కోట్ల షేర్ ఫస్ట్ డే నమోదు చేసి రికార్డులు నెలకొల్పింది..

Ads

దసరా


నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన పక్కా మాస్ మూవీ దసరా ఫస్ట్ డే రూ. 14.22 కోట్ల వసూలు రాబట్టింది.

అది పురుష్


ప్రభాస్ రాముడిగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు 32.84 కోట్ల షేర్ రాబట్టి ఈ సంవత్సరం అత్యధిక ఫస్ట్ డే వసూలు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత పలు వివాదాల కారణంగా చిత్రం డిమాండ్ పడిపోయింది.

విరూపాక్ష


సాయి ధరమ్ తేజ హీరోగా వచ్చిన హారర్ ధ్రిల్లర్ మూవీ విరూపాక్ష తొలి రోజు 4.79 కోట్ల షేర్ రాబట్టింది.

బేబీ


ప్రస్తుత జనరేషన్ లవ్ అఫైర్స్ మరియు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్ట్ వినూత్నంగా ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ డే రూ. 2.60 కోట్ల షేర్ రాబట్టింది

బ్రో

bro movie censor talk
పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ కాంబినేషన్లో వచ్చిన బ్రో చిత్రం తొలి రోజు రూ. 23.61 కోట్ల షేర్స్ రాబట్టింది.

 

Previous articleపవన్ నటించిన లాస్ట్ ఫైవ్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Next articleమురారి ,బలగం ,బ్రో ఇలా చావు కాన్సెప్ట్ తో వచ్చిన 7 సినిమాలు…!