Ads
ప్రతి ఒక్కరూ కూడా తమ లైఫ్ లో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. దాని కోసం కష్టపడి చదివి తాము అనుకున్నట్టుగా మంచి ఉద్యోగాన్ని పొందుతారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఈ విధంగానే సంవత్సరానికి కోట్లలో జీతం వచ్చే ఉద్యోగాన్ని సాధించాడు.
Ads
దానితో అతను సంతోషంగా జీవించవచ్చు. కానీ తన ప్రేయసికి ఇచ్చిన మాట కోసం అతను కోట్ల రూపాయలు వచ్చే జీతాన్ని, ఉద్యోగానికి వదిలి మాటను నిలబెట్టుకున్నాడు. అయితే అతను తన ప్రేయసికి ఏమని మాట ఇచ్చాడు? ఆ ప్రేయసి కోరింది ఏమిటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..సౌత్ కొరియాలో ఒక హోటల్ లో ఇద్దరు ప్రేమికులు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. అది కూడా వారి భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే వారిద్దరూ కూడా భారతదేశం నుండి కొరియాకు ఉద్యోగం కోసమే వెళ్లారు. సాంసంగ్ కంపెనీలో ఆ వ్యక్తి ఏడాదికి కోట్లలో సంపాదిస్తున్నాడు. అతను డిన్నర్ చేస్తున్న సమయంలో తన ప్రేయసిని నువ్వు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగాడు. దానికి ఆమె నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని ఐఏఎస్ ఆఫీసర్ గా చూడాలన్నదే తన కోరిక అని తెలిపింది. అప్పుడు అతను నీ కోరిక ఇదేనా? అయితే నేటి నుండి నీ కోరిక తీర్చడమే నా గోల్ అని, కోట్ల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇండియా వచ్చాడు. అప్పటి నుండి సివిల్స్ కి కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు.
అయితే సివిల్స్ రాయడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఆ విషయం కనిష్క్ కటారియాకి బాగా తెలుసు. ఎందుకంటే అతని తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి. ఇండియాకి వచ్చిన తర్వాత సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న అతను తొలిసారే ప్రిలిమ్స్ కి క్వాలిఫై అయ్యాడు. కటారియా ఆప్షనల్ సబ్జెక్టుగా మ్యాథమెటిక్స్ ను ఎంచుకుని, 2018 లో సివిల్ పరీక్షలు రాసి, అందులో ఫస్ట్ ర్యాంకును సంపాదించాడు. UPPSC లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన కనిష్క్ కటారియా అంటూ వార్తల్లో నిలిచాడు. కొరియాలో డిన్నర్ చేస్తూ ప్రేయసీకి మాట ఇచ్చిన వ్యక్తి ఇతనే. 2019లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
Also Read: ఆమెకు 20.. నాకు 40.. మాది హ్యాపీ లైఫ్..! వయస్సు అనేది నా దృష్టిలో ఒక నెంబర్ అంతే..!