“క్రాక్” సినిమాలో విలన్ కఠారి కృష్ణ ఎవరు ? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ఎం చేస్తున్నాడంటే ?

Ads

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా అందరికీ నచ్చింది మంచి హిట్ ని కూడా రవితేజకి సినిమా తీసుకువచ్చింది. రవితేజ సరసన ఈ సినిమాలో శృతిహాసన్ నటించారు.గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో కఠారి కృష్ణ పాత్రని ఎంతో అద్భుతంగా తీసుకువచ్చారు డైరెక్టర్. ఎప్పుడైనా కఠారి కృష్ణ అంటే మనకి క్రాక్ సినిమా గుర్తొస్తుంది. అడ్డు వచ్చిన వ్యక్తి ని క్రాక్ సినిమాలో కిరాతకంగా చంపేస్తాడు. కఠారి కృష్ణ లిమిట్ లేకుండా దందాలు చేస్తూ ఉంటాడు.

సముద్రఖని కఠారి కృష్ణ పాత్ర చేసి బాగా ఆకట్టుకున్నారు. మీకో విషయం తెలుసా నిజంగా కఠారి కృష్ణ ఉన్నాడు. బయట కఠారి కృష్ణ తో మాట్లాడిన తర్వాత గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాలో ఆ పాత్రను తీసుకు వచ్చారు.

గోపీచంద్ మలినేని కఠారి కృష్ణ తో మాట్లాడిన తర్వాత ఆ పాత్రని క్రియేట్ చేశారట. ఈ విషయాన్ని గోపీచంద్ మలినేని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. నిజానికి బయట కఠారి కృష్ణ గొంతులు కోసేవాడట కానీ ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడో తెలుసా..? ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాడు. మరి ఇక ఆయన కథ ఏంటి అనేది చూద్దాం.

Ads

1970 నుంచి 2000 సంవత్సరం వరకు కఠారి కృష్ణ పేరు వింటే ఒంగోలు లో వణికిపోయేవారు. ఈయనది గోపాలపురం. మోటార్ ఫీల్డులో పని చేస్తూనే హత్యలకు ప్లాన్ చేసేవాడట. చింతల నారాయణ, పిచ్చయ్య అనే వాళ్ళ మీద హత్యాయత్నం చేసాడు.  ఒకరు ఇందులో చనిపోగా 14 మందికి జైలు శిక్ష పడింది. వీరిలో కఠారి కృష్ణ వున్నాడు. జైలు నుండి వచ్చాక కూడా అంతా భయ పడేవాళ్ళు.

1980లో బ్యాంక్ ఎన్నికల్లో వెంకటసుబ్బయ్య ని హత్య చేసి జైలుకి వెళ్ళాడు. బయట నుండి వచ్చాక కూడా దందాలు చేసాడు. ఇతనికి రెండో భార్య జయమ్మ క్రాక్ లో చూపినట్టే ఉండేది. ఈమె హత్య జరిగినాక కఠారి రౌడియిజం తగ్గింది. అలానే తరవాత మొదటి భార్య, కూతురు దూరమయ్యారు. ఇప్పుడు ఉల్లిపాయలు అమ్ముకుంటూ గంజి నీళ్లు తాగుతున్నాడు. ఇవన్నీ కఠారి కృష్ణ గోపిచంద్ మలినేని కి చెప్పారని అన్నారు.

Previous articleఅక్కడ ముందుగా పూలవర్షం కురిపించారు తరువాత కోడిగుడ్లతో కొట్టారని మెగాస్టార్ కామెంట్స్..
Next article“దుబాయ్ శీను” లో ఎం ఎస్ నారాయణ చేసిన క్యారెక్టర్ ఎవర్ని టార్గెట్ చేస్తూ తీశారంటే ?