“దుబాయ్ శీను” లో ఎం ఎస్ నారాయణ చేసిన క్యారెక్టర్ ఎవర్ని టార్గెట్ చేస్తూ తీశారంటే ?

Ads

దర్శకుడు శ్రీను వైట్ల గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. శ్రీను వైట్ల ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అన్న విషయం మనకి తెలుసు. కానీ వరుస డిజాస్టర్స్ రావడం వలన ఆ డైరెక్టర్ వెనకే ఉండిపోయాడు. అతనితో సినిమాలు చేయడానికి ఇప్పుడు హీరోలు కూడా ముందుకు రావడం లేదు. మెగా స్టార్ చిరంజీవి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ చిరంజీవి కి నచ్చే స్క్రిప్ ని తయారు చేయడంలో శ్రీను వైట్ల ఫెయిల్ అవుతున్నారు.

మంచు విష్ణు కూడా ఒక సినిమా శ్రీను వైట్ల దర్శకత్వం లో చేయాలని అనుకున్నాడు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. శ్రీను వైట్ల దర్శకత్వం లో గోపీచంద్ హీరోగా త్వరలో ఒక సినిమా రాబోతుంది అని వార్తలు వినపడుతున్నాయి.

Ads

గతంలో శ్రీను వైట్ల సినిమాల పై కొంతమంది సెలబ్రిటీలు సెటైర్లు కూడా వేశారు. ముఖ్యంగా దుబాయ్ శీను సినిమాలో శ్రీను వైట్ల ఎమ్మెస్ నారాయణతో చేయించిన పాత్ర ఒక హీరో మీద సెటైర్ లాగ ఉందట. శ్రీను వైట్ల ఇది వరకు ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసేవాడు. ఆ డైరెక్టర్ ఒక స్టార్ హీరో తో సినిమా చేశాడు. అప్పుడు ఆ స్టార్ హీరో అచ్చం దుబాయ్ శీను లో ఎమ్మెస్ నారాయణ చేసినట్లే చేశాడట. దుబాయ్ శీను లో ఎమ్మెస్ నారాయణ చేసిన పాత్ర ఆ హీరో నుండి వచ్చినదే.

ఆ కామెడీ బాగా సినిమాకి ప్లస్ అయింది. సినిమా కూడా అందరిని మెప్పించింది. దీంతో శ్రీను వైట్ల ఆ స్టార్ హీరో మీద పగబట్టి ఆ పాత్రని చేశాడా అని అంతా అన్నారు. దుబాయ్ శీను లో ప్రత్యేకంగా రవితేజ నటన గురించి చెప్పుకోవాలి. 2007లో ఈ సినిమా వచ్చింది. రవితేజ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార నటించింది. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్ బాగా ఆకట్టుకున్నారు. డీవీవీ దానయ్య ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

Previous article“క్రాక్” సినిమాలో విలన్ కఠారి కృష్ణ ఎవరు ? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ఎం చేస్తున్నాడంటే ?
Next articleఈ 10 అలవాట్లు ఉంటే జీవితంలో డబ్బు సంపాదించలేరు…!