హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ రోల్ లోనూ అలరించిన 14 మంది హీరోయిన్లు..

Ads

సాధారణంగా సినిమాలలో హీరోయిన్లు పాజిటివ్ రోల్స్ చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే చాలా మంది హీరోయిన్లు నెగిటివ్ రోల్స్ చేయడానికి ఇష్టపడరు. దానికి కారణం లేకపోలేదు. నెగిటివ్ రోల్ లో నటిస్తే, వారికున్న హీరోయిన్ ఇమేజ్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అనుకుంటారు. అందువల్ల హీరోయిన్స్ నెగిటివ్ రోల్స్ కు దూరంగా ఉంటారు.

కానీ కొందరు హీరోయిన్లు నెగిటివ్ రోల్స్ చేయడాన్ని ఇష్టపడతారు. నెగిటివ్ రోల్ ని కూడా కేవలం ఒక క్యారెక్టర్ లాగానే చూస్తారు. అలా కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చేయగలము అని ఇప్పటికే కొంత మంది హీరోయిన్లు నిరూపించారు.
అందంగా ఉండే హీరోయిన్లలో మరి ఇంత క్రూరత్వం కూడా ఉందా అనిపించేలా కొంతమంది హీరోయిన్లు నెగిటివ్ రోల్స్ లో నటించి ఆడియెన్స్ తో ఔరా అనిపించారు. ఇక టాలీవుడ్ లో నెగిటివ్ రోల్ లో నటించిన హీరోయిన్స్ ఎవరో, అలా వారు నటించిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

1.రమ్యకృష్ణ- నరసింహా సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించింది.2. భానుప్రియ- గూఢాచారి 117లో  నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. 3.సౌందర్య-నా మానసిస్తా రా సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. 4. రాశి-నిజం సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.

Ads

5. శ్రేయా రెడ్డి-పొగరు సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించింది.6. రీమాసేన్-వల్లభ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. 7. త్రిష-ధర్మయోగి సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించింది.

8. నిఖిత-డాన్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. 9. ప్రియమణి చారులత సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. 

10. రెజినా ఎవరు సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించింది. 

11. పాయల్ రాజ్ పూత్ ఆర్.ఎక్స్.100 సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించింది.

12. కాజల్ అగర్వాల్ సీత మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. 

13. తమన్నా మ్యాస్ట్రో సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించింది. 

14. వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పటికే కొన్నిసినిమాలలో నెగెటివ్ రోల్స్ లో నటించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన వీరసింహారెడ్డిలో చేసింది. Also Read: రోజా జ‌బ‌ర్ద‌స్త్‌ కామెడీ షోని మానేయడానికి కార‌ణం మెగా బ్రదర్ నాగ‌బాబు నేనా?

 

Previous articleరోజా జ‌బ‌ర్ద‌స్త్‌ కామెడీ షోని మానేయడానికి కార‌ణం మెగా బ్రదర్ నాగ‌బాబు నేనా?
Next articleలవ్ టూడే మూవీ హీరోయిన్ ఇవానా షాజీ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.