Ads
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రోజా ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. హీరోయిన్ రోజా తెలుగు అమ్మాయి. ప్రస్తుతం ఆమె ఏపీ పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉంది. అయితే రోజా జబర్దస్త్ కామెడీ షోలో కొన్నాళ్లు జడ్జిగా చేసింది. ఆ తరువాత జబర్దస్త్ కు దూరంగా ఉంది.
దాంతో నాగబాబుతో రోజాకు షో సమయంలో విభేదాలు వచ్చినట్లుగా ఆ మధ్య రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. ఇక రోజా కారణంగానే నాగబాబు జబర్దస్త్ షోను వీడి వెళ్లారని కూడా కామెంట్లు వచ్చాయి. ఆ క్రమంలో రోజా ఈ కామెంట్ల పై స్పందించి, క్లారిటీ ఇచ్చారు. మెగా బ్రదర్ నాగబాబుకు నాకు మధ్య ఎలాంటి విభేదాలు కూడా లేవని, అవన్నీ కావాలని కల్పించిన పుకార్లు అని తెలిపారు.
Ads
నాగబాబు తనను గౌరవించేవారని, ప్రొడ్యూసర్స్ ని ఇబ్బంది పెట్టని హీరోయిన్ వి అని పలుమార్లు అన్నారని రోజా చెప్పుకొచ్చింది. ఇక నాగబాబుకు చాలా గౌరవం ఇస్తానని ఆమె పేర్కొంది. అయితే జబర్ధస్త్‌కి రోజా దూరం అవడానికి వెనక నాగబాబు ఉన్నరనేది అబద్దం అని కొందరు అంటున్నారు. ప్రస్తుతం రోజా ఏపీ టూరిజం మంత్రిగా అవడం వల్లనే షో నుండి తప్పుకున్నారని చెప్తున్నారు. నాగబాబు, రోజా దాదాపు 10 ఏళ్ల పాటు జబర్థస్త్ జడ్జిలుగా షోను సక్సెస్ చేయడంలో ముఖ్యపాత్ర పోషించారు. కాగా 2019లో కొన్ని కారణాల వల్ల నాగబాబు ఈ షో నుంచి తప్పుకున్నారు.
ఇక రోజా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత రోజా ఆ షో నుండి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఇంద్రజ, కృష్ణభగవాన్ మరియు మరికొంత మంది గెస్ట్ లతో జబర్థస్త్ కామెడీ షోను నడిపిస్తున్నారు. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు సంపాదించుకున్న రోజా ఎప్పుడూ ప్రతిపక్షనాయకులకు కౌంటర్లు ఇవ్వడంలో ముందుంటుంది. అందులో మరి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై ఆమె దారుణంగా కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తలలో నిలుస్తుంటుంది.
Also Read: గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న”నాటు నాటు” పాట గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు..