Ads
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా స్కంద. సాధారణంగా బోయపాటి సినిమాలు అంటే లాజిక్ కి దూరంగా ఉంటాయి. ఎమోషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
అందుకే బోయపాటి శ్రీను సినిమాలకు వెళ్లేటప్పుడు లాజిక్ అనే పదాన్ని మర్చిపోయి వెళ్లాలి అని సరదాగా అంటూ ఉంటారు. చాలా సినిమాల్లో బోయపాటి శ్రీను యాక్షన్ సీన్స్ ఇలాగే ఉంటాయి. వినయ విధేయ రామ సినిమాలో గద్దల సీన్, అంతకుముందు వచ్చిన దమ్ము సినిమాలో చాలా యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా అసలు లాజిక్ తో సంబంధం లేకుండా ఉంటాయి.
ఇప్పుడు ఈ సినిమా కూడా వీటికి మినహాయింపు ఏమీ కాదు. స్కంద సినిమాలో ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని సీన్స్ మాత్రం విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
#1 సినిమాలో రామ్ పోతినేని ఎంట్రీ సీన్ లో ఒక ఎద్దుతో ఫైట్ ఉంటుంది. అక్కడ కొంత మంది రౌడీలు వస్తే వారిని రామ్ పోతినేని కొడతారు. ఆ కొట్టే క్రమంలో ఒక బేస్ బాల్ బ్యాట్ ని ఉపయోగిస్తారు. ఒక వ్యక్తిని కొట్టి ఆ బ్యాట్ ని గాలిలో పెడతారు. పక్కన ఇంకో వ్యక్తి వచ్చినప్పుడు గాలిలో అలాగే ఉన్న బ్యాట్ తీసుకొని కొడతారు. సాధారణంగా అసలు బ్యాట్ చేతిలో నుండి వదిలేస్తే కింద పడిపోతుంది. అది ఏ బ్యాట్ అయినా కూడా. కానీ ఈ సినిమాలో మాత్రం విచిత్రంగా గాలిలోనే నిలుస్తుంది.
#2 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూతురు, తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకుతో వెళ్లిపోయింది అని తెలిసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన మామయ్యని చంపేస్తాడు. జల్సా సినిమాలో ఒక యోగా సీన్ లో ఒక వ్యక్తి మెడని తిప్పేసినట్టు కామెడీగా చూపిస్తారు. కానీ ఈ సినిమాలో సీరియస్ గానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన మామయ్య తలని వెనక్కి తిప్పేస్తాడు. ఈ సారి ఫిజిక్స్ మాత్రమే కాదు, హ్యూమన్ అనాటమీ కూడా మర్చిపోయారు అన్నమాట.
Ads
#3 ఈ సీన్ కి మాత్రం విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అదేంటంటే, తెలంగాణ సీఎం ఇంటికి హీరో దర్జాగా వెళ్లి, అక్కడ ఉన్న వారందరిని కొట్టి, ఇద్దరు సీఎంల కూతుళ్ళని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోతాడు. అసలు సీఎం ఇంట్లోకి ఎంటర్ అవ్వడమే కష్టం. కానీ హీరోయిన్ రమ్మంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతో బలంగా ఉన్న సెక్యూరిటీని కూడా హీరో చాలా సింపుల్ గా కొట్టేసి హీరోయిన్స్ ని తీసుకెళ్లిపోతాడు. చాలా సీరియస్ గా చేసినా కూడా చూసే ప్రేక్షకుడికి అది సీరియస్ సీన్ లాగా ఎక్కడ అనిపించలేదు.
#4 ఇంకొక సీన్ లో ఒక పోలీస్ ని హీరో చంపేస్తాడు. కానీ కట్ చేస్తే నెక్స్ట్ షాట్ లో అదే పోలీస్ సీఎం వెనకాల నిల్చొని షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. ఇది ఎడిటింగ్ మిస్టేక్. ఈ విషయాన్ని మాత్రం సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ, ఇటీవల ఓటీటీ లో వచ్చినప్పుడు దీన్ని చూసినవారు ట్రోల్ చేస్తున్నారు.
#5 ఈ సినిమాలో అమ్ముకి నెత్తి మీద దెబ్బలు తగులుతాయి. మొదటి నుండి చివరి వరకు కోమాలోనే ఉన్న అమ్ము కోలుకొని చివరికి మామూలు అవుతుంది. కానీ తలకి దెబ్బలు తగిలినప్పుడు చికిత్స చేయాలి అంటే కచ్చితంగా జుట్టు తీస్తారు. సినిమాలో దెబ్బలు తగిలిన అప్పటి నుండి, తను కోలుకొని బయటికి వచ్చేంతవరకు అమ్ముకి జుట్టు మీద బ్యాండేజ్ వేసి ఉంటుంది. “లాజిక్స్ ఎలాగో ప్రతి సీన్ లో చూసుకోవడం కష్టం. కానీ ఇలాంటి చిన్న విషయాలు కూడా చూసుకోకుంటే ఎలా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి మాత్రమే కాదు. ఈ సినిమాలో ఇలాంటి సీన్స్ ఇంకా చాలానే ఉన్నాయి. టైం కానీ టైంలో వచ్చే పాటలు. చాలా కోపంలో హీరోని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన హీరోయిన్, హీరో డాన్స్ వేయడం మొదలు పెట్టగానే వెళ్లి హీరోతో కలిసి సింక్ లో పాటలు పాడుతూ డాన్స్ వేస్తుంది. ఇప్పుడు ఈ సీన్స్ గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
ALSO READ : ఆ వెంకీ సినిమాకి అప్పుడే 25 ఏళ్లు అంట…ఆటోలో తిరుగుతూ సెలెబ్రేట్ చేసుకున్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా.?