పెళ్లయ్యాక మగవాళ్లలో వచ్చే మార్పులు ఇవే..! ఇందుకు కారణాలు ఏంటంటే…?

Ads

పెళ్లి అనేది జీవితంలో ఓ ముఖ్యమైన, అనిర్వచనీయమైన ఘట్టం. వివాహం అనే మధురమైన ఘట్టం ప్రతి ఒక్క జంటకూ ఎంతో ప్రత్యేకం. అయితే చాలా మంది కలలు కన్నట్లు.. వాస్తవ జీవితం మాత్రం అలా ఎప్పటికీ ఉండదు. ఈ బంధం ఇద్దరు మనుషుల మధ్య నిబద్ధత, ఇది వారిని జీవితాంతం ఒకరికొకరు అనుబంధంగా ఉంచుతుంది. ప్రతి సుఖం, దుఃఖంలో కలిసి నిలబడటానికి హామీ ఇస్తుంది.

అయితే వివాహమైన తరువాత ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులు కచ్చితం. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలు, అభిరుచులు, అలవాట్లు అనేవి ఒకే విధంగా ఉండవు. అందుకే ఒకరికి కోసం ఒకరు కాస్త మారాల్సి ఉంటుంది.

movie based on four women

 

కానీ పెళ్లయ్యాక చాలా మంది స్త్రీల నోట వినిపించే మాట “పెళ్లికి ముందు అతను చాలా భిన్నంగా ఉన్నాడు! ఏం జరిగిందో నాకు తెలియదు. అతను మారిపోయాడు” అని. నిజానికి వివాహం తర్వాత పురుషులు మారతారు.. అది నిజమే. మీ భర్త ప్రవర్తనలో మార్పులు మీకు తెలియకుండానే మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తాయి.

పెళ్ళికి ముందు ఎవరైనా తమలోని మంచి గుణాలను మాత్రమే తన కాబోయే భాగస్వామికి చూపిస్తారు. కానీ పెళ్లయ్యాక ఆ జంట నిజం లో జీవించటం మొదలుపెడతారు. తమ భాగస్వామి కొన్ని రోజులకు ఆ మార్పులకు అలవాటు పడతారు కానీ ఆ మార్పులు భరించలేకుండా ఉంటే మాత్రం మీ భాగస్వామితో ఆ విషయాల గురించి చర్చించాలి.

Ads

అలాగే పెళ్ళికి ముందు మీకు కేటాయించిన సమయం పెళ్ళైన తర్వాత బాధ్యతలతో దొరక్కపోవచ్చు. కానీ వారు మిమ్మల్ని ఎప్పటిలాగే ప్రేమిస్తున్నారు అన్న విషయాన్నీ మీరు గుర్తుంచుకోవాలి. అలాగే పెళ్ళైన తర్వాత వారు ఫిట్ గా ఉండాలి అన్న విషయానికి అంత ప్రాధాన్యతనివ్వరు. దాన్ని కూడా భాగస్వామి అర్థం చేసుకోవాలి.

జీవితం అనేది అనుకున్నంత సులభంగా, సాఫీగా ఉండదు. ఎన్నెన్నో ఒడిదుడుకులు సహజం. అందుకే జీవిత భాగస్వామిలో ఉన్న మంచి లక్షణాల్నే కాకుండా..లోపాల్ని కూడా స్వీకరించగలగాలి, అర్ధం చేసుకోగలగాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లగలమని అర్ధం చేసుకోవాలి.

పెళ్లయ్యాక మగవాళ్లే కాదు, ఆడవాళ్లు కూడా మారతారు. కొన్ని మార్పుల కారణం గా మీకు తెలియకుండానే మీరు మీ జీవిత భాగస్వామిని తేలికగా తీసుకోవడం ప్రారంభిస్తారు. చాలా మంది జంటలు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గొడవలను వీలైనంత త్వరగా మరచిపోయేందుకు ప్రయత్నించాలి. ఇలా చేస్తే మీ గొడవలు పెద్దవి కాకుండా ఉంటాయి. దీని వల్ల మీ మధ్య ప్రేమ, సాన్నిహిత్యం అనేవి మరింత పెరుగుతాయి.

Previous article“స్కంద” సినిమాలో… “లాజిక్” లేకుండా తీసిన 5 సీన్స్ ఇవే..!
Next articleభర్త నుండి విడాకులు తీసుకున్న “మనసు మమత” సీరియల్ నటి..! “కేవలం గౌరవం మాత్రమే ఉంది..!” అంటూ..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.