Ads
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని కొంతమంది తొలిచూపులోనే ప్రేమలో పడతారు. కొందరి విషయంలో పరిచయం, స్నేహం, అది ఆ తరువాత ప్రేమగా మారడం జరుగుతుంది. ప్రేమ పరీక్షలో కొంతమంది సులభంగా పాస్ అవుతారు. కొంతమంది ఆలస్యంగా అయిన పాస్ అవుతారు. కానీ కొందరు ఫెయిల్ అవుతారు.
Ads
ప్రేమ తరువాత పెళ్లితో ఒకటావుతారు. అయితే కొందరికి పెళ్లి చేసుకునే లోపే వారిది ప్రేమ కాదని తెలుసుకుని బ్రేకప్ చెప్పుకుంటారు. ఇంకొందరు ఎంగేజ్‌మెంట్ దాకా కూడా వెళ్లి ఆ తరువాత రద్దు చేసుకుంటారు. ఇలా సినీ ఇండస్ట్రీలో కూడా జరిగాయి. ప్రేమించుకున్న తరువాత బ్రేకప్, ఎంగేజ్‌మెంట్ కాన్సిల్ చేసుకున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..1. త్రిష:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష వ్యాపార బిజినెస్ మెన్ వరుణ్ మానియన్ ని ప్రేమించింది. ఆ తరువాత ఇద్దరూ పెద్దల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. వారి వివాహానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కానీ వివాహానికి ముందే విడిపోయారు.
2. నయనతార:
లేడి సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార మొదట్లో కోలీవుడ్ హీరో శింబును ప్రేమించింది. కొన్నాళ్ళ తరువాత ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత ప్రభుదేవాతో ప్రేమలో పడింది. వారి ప్రేమ పెళ్లి పీటల దాకా వెళ్లిన తరువాత విడిపోయారు. ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది.3. మెహరీన్:
టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్, భవ్య భిష్ణోయ్‌ను ప్రేమించింది. వీరిద్దరు సంతోషంగా కలిసి తిరగడమే కాకుండా ఫోటోషూట్లు చేసుకున్నారు. వీరి ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. కానీ కొన్ని రోజులకే అభిప్రాయబేధాలతో పెళ్లిని రద్దు చేసుకున్నారు.
4. రష్మిక మందన్నా:
నేషనల్ క్రష్ గా పాపులర్ అయిన రష్మిక మందన్నా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్. ఆమె తొలి సినిమా కిరిక్ పార్టీ. ఆ చిత్రంలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టిని ప్రేమించింది. ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. కానీ అంతలోనే విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు.Also Read: మహేష్-నమ్రత 18 ఏళ్ళ వివాహ బంధం.. అరుదైన ఫోటోని షేర్ చేసిన నమ్రత..