ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు..! అంతగా ఏం ఉంది ఇందులో..?

Ads

ఏదైనా ఒక సినిమా నచ్చితే, మన వాళ్ళు ఎంత ఆదరిస్తారో అందరికి తెలుసు. అలా ఇటీవల ఒక సినిమా గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అది మన సినిమా కాదు. అంటే మన భాష సినిమా కాదు. మలయాళంలో విడుదలైన సినిమా.

అయినా కూడా మన దగ్గర ఈ సినిమా గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. అంత మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆ సినిమాని తెలుగులో కూడా చేసి విడుదల చేస్తున్నారు. ఆ సినిమా పేరు మంజుమ్మెల్ బాయ్స్.

movie which became discussion

నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. 20 కోట్ల బడ్జెట్ తో రూపొంది రిలీజ్ అయిన ఈ సినిమా, 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాలో షౌబీన్ షాహిర్‌, సాబు వ‌ర్గీస్, శ్రీనాథ్ భాసి ముఖ్య పాత్రల్లో నటించారు. కొచ్చిలో ఉండే కొంత మంది అబ్బాయిలు మంజుమ్మెల్ బాయ్స్ అని పేరుతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత వాళ్ళందరూ కలిసి కొడైకెనాల్ లో విహార యాత్రకు వెళ్తారు. కానీ వారిలో ఉండే సుభాష్ (శ్రీనాథ్ భాసి) అనే వ్యక్తి అందుకు రాను అని చెప్తాడు.

movie which became discussion

కానీ అదే బ్యాచ్ లో ఉండే కుట్టన్ (షౌబీన్ షాహిర్‌) బలవంతంగా సుభాష్ ని తీసుకెళ్తాడు. తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక గుడికి వెళ్లి, ఆ తర్వాత గుణ గుహకి వెళ్తారు. ఆ గుహలో కొన్ని లోతైన లోయలు ఉంటాయి. అక్కడ పడిన వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేదు. దాంతో అక్కడికి వెళ్లడానికి పోలీసులు, అటవీ శాఖ వారు నిషేధిస్తారు. వెళ్లకుండా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. అయినా కూడా వీళ్ళందరూ సెక్యూరిటీ సిబ్బందికి దొరకకుండా, ఆ గుహ లోపలికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.

Ads

movie which became discussion

టేకింగ్ పరంగా సినిమా ఎంత స్ట్రాంగ్ గా ఉంటే సినిమా ప్రేక్షకులకు అంత బాగా నచ్చుతుంది. ఈ సినిమా అలాంటిదే. 2006 లో ఇలాంటి సంఘటన జరిగింది. దాని ఆధారంగానే సినిమా రూపొందించారు. సాధారణంగా మలయాళం సినిమాలు అంటేనే కాన్సెప్ట్ కి పెట్టింది పేరు. ఎంతో మంది చేయడానికి భయపడే ప్రయత్నాలు అన్నీ కూడా వారు చేస్తారు. అలా చేసి విజయం సాధిస్తారు.

movie which became discussion

సినిమా కథ సింపుల్ గా ఉంటుంది. ఒక నాలుగు-ఐదు లైన్లలో కథ చెప్పేసే విధంగా ఉంటుంది. కానీ టేకింగ్ పరంగా మాత్రం చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా పరిశీలించి రూపొందించారు. సాధారణంగా ఇలాంటి సినిమాలని సర్వైవల్ జోనర్ అని అంటారు. ఇది కూడా అదే జోనర్ లోకి చెందుతుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుంది అనే వార్త వచ్చింది. ఈ నెలలోనే విడుదల అవుతుంది అని అన్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ALSO READ : రెమ్యూనరేషన్ విషయంలో “కిరణ్ అబ్బవరం” కొత్త రూట్ గురించి తెలుసా..? ఇలా ఏ హీరో చేయరు ఏమో..!

Previous articleబాలకృష్ణ కోసం చంద్ర మోహన్ ను అవమానించారా? ఆ సినిమా షూటింగ్ లో అసలేం జరిగింది?
Next articleప్రేమలో ఫెయిల్యూర్ అయిన నలుగురు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ వీరే ..