మహేష్ ‘ఒక్కడు’ మూవీలో ధర్మవరపు సుబ్రమణ్యం చెప్పే ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసా?

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లోనే మొదటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమా ఒక్కడు. రాజకుమారుడు,మురారి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికి మహేష్ కు ఒక్కడు మూవీతోనే స్టార్ డమ్ వచ్చింది. అప్పట్లో ఈ సినిమా సంచలనాలకు తెర తీసి, అప్పటికి ఉన్న రికార్డులను తిరగరాసింది.

Ads

ఈ సినిమా 100 పైగా సెంటర్లలో వందరోజులు ఆడింది. దర్శకుడు గుణశేఖర్ ఒక్కడు మూవీతో స్టార్ డైరెక్టర్ గా మారాడు. మహేష్ బాబును మాస్‌కు మరింత దగ్గరగా చేసిన సినిమా ఒక్కడు అనే చెప్పాలి. హీరోయిన్ భూమిక, మహేష్ బాబు మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రకాశ్ రాజ్ నటన, సినిమాలో కనిపించే భారీ ఛార్మినార్ సెట్, కామెడీ సన్నివేశాలు, కబడ్డీ ట్రాక్ ఇలా ప్రతీ ఒక్కటి వర్కవుట్ అయ్యి సినిమా బలజ బస్టర్ అయ్యేలా చేశాయి.ఇక ఈ సినిమాలో ఒక ఆసక్తికర,హాస్య సన్నివేశం ఉంటుంది. దీనిలో మహేష్ బాబు పాస్ పోస్ట్ కోసం వెళ్ళినపుడు అక్కడ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రమణ్యం ఒక ఫోన్ నెంబర్ ను పదే పదే చెప్తాడు. అది కూడా తన ప్రేయసికి కాల్ చేసి మాట్లాడాలని చూసే సందర్భంలో పాస్ పోర్ట్ కోసం వచ్చిన మహేష్ అతడిని టార్చర్ పెట్టే సీన్ అద్భుతంగా పండింది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొత్తగా మొబైల్ కొని, ఆ నంబర్ ని తన లవర్ కి చెబుతాడు. ఈ ఫోన్ కు ఫస్ట్ కాల్ నువ్వే చేయాలని అడుగుతాడు.ఇక ఆ నంబర్ ని మహేష్ బాబు గ్యాంగ్ విని, టోనీ అనే పేరుతో పాస్ పోర్ట్ కోసం సుబ్రహ్మణ్యంను విసిగించడం సరదాగా ఉంటుంది. ఇంతకీ ఆ ఫోన్ నంబర్ ఏంటి అంటే 9848*****9. ఈ సన్నివేశం షూట్ చేసటప్పుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం వాడే నంబర్ ఎవరి నంబర్ అయితే బాగుంటుంది అనుకుంటూ ఉండగా ఎవరిదో ఎందుకని ఆ సినిమా నిర్మాత ఎంఎస్ రాజు నంబరే వాడేద్దాం అంటూ సలహా ఎవరో ఇచ్చారంట. దాంతో ఆయన నంబర్ ని వాడారు. అంతవరకు బాగానే ఉన్న సినిమా రిలీజ్ అయ్యాక, ఆ నంబర్ కు లక్షల్లో కాల్స్ రావడంతో నిర్మాత ఎంఎస్ రాజు ఫోన్ నంబర్ మార్చుకున్నారు.

Also Read: ఈ ఏడాది భారతీయులు గూగుల్‌లో వెతికిన టాప్ 10 సినిమాల ఏమిటో తెలుసా?

Previous article‘జబర్దస్త్’ షోతో సినిమాల్లో కంటే ఎక్కువ సంపాదిస్తున్న నటులు ఎవరో తెలుసా?
Next articleఅడివి శేష్ లాగా డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోస్…లిస్ట్ ఓ లుక్ వేయండి.
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.