Ads
తెలుగు సిని ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ నేపద్యం లేకుండానే వచ్చారు. ఆయన తన కృషితో అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ కి మెగాస్టార్ గా మారారు.
Ads
మెగాస్టార్ స్పూర్తి తో ఆయన సోదరులు నాగబాబు, ఆ తరువాత పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఏ హీరోకి లేనటువంటి ప్రత్యేక ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నాడు.ఆ తరువాత మెగా వారసుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక మెగాస్టార్ వరుస సినిమాలలో నటిస్తూ, మరో వైపు ఇండస్ట్రీకి పెద్దన్నగా ఉన్నారు.చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరులో 1955 ఆగస్టు 22న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి. వీరి ప్రథమ సంతానం చిరంజీవి. ఆయనకు 25 ఏళ్ల వయసులో 1980లో సురేఖను వివాహం చేసుకున్నారు. సురేఖా హాస్యనటుడు అల్లు రామలింగయ్య కూతురు. చిరంజీవి, సురేఖ దంపతులకు కుమారుడు రామ్ చరణ్, ఇద్దరు కుమార్తెలు సుస్మిత, శ్రీజ, ఇక మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత అందరికీ సూపరిచితమే.
ఇక సుస్మితకు చెన్నైకి చెందిన విష్ణుప్రసాద్ అనే వ్యక్తితో పెళ్లి జరిపించారు. విష్ణు ప్రసాద్ ఫ్యామిలీ రాయలసీమ నుండి వెళ్లి చెన్నైలో స్థిరపడింది. విష్ణు ప్రసాద్ తాత పేరు ఎల్‌వీ రామారావు. ఆయన అప్పట్లో చెన్నైలో పేరు ప్రఖ్యాతులు ఉన్న బిజినెస్ మెన్. ఆయన జపాన్, అమెరికా, సింగపూర్ లాంటి దేశాలతో బిజినెస్ లావాదేవీలు జరిపేవారని తెలుస్తోంది. ఇక ఆయన కుమారుడు ఎల్‌వీ ప్రసాద్ కుమారుడే విష్ణు ప్రసాద్. ఆయన వ్యాపార రంగంలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. విదేశాలలో చదువు పూర్తి అయిన తరువాత చెన్నైలోనే ఉంటూ ఫ్యామిలీ బిజినెస్ లను చూసుకోవడం ప్రారంభించాడు.ఇక సుస్మిత, విష్ణు ప్రసాద్ జంటకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ప్రస్తుతం సుస్మిత భర్త ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనర్ కొర్స్ పూర్తి చేసింది. ఆమె ఇపుడు యాక్టర్స్ కు కాస్ట్యూమ్‌లను డిజైన్ చేస్తోంది. చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 మూవీకి సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసింది.
Also Read: మంచి పాత్రలను వదులుకున్న 10 మంది స్టార్లు వీరే..!