పండుగల పేర్లతో వచ్చిన 10 తెలుగు సినిమాల గురించి తెలుసా ? ఎన్ని ఉన్నాయి ? ఎప్పుడొచ్చాయి ?

Ads

పండుగకి కొత్త సినిమాలు థియేటర్ల లో విడుదలవుతాయి. పండగ పేరుతో సినిమాలు కూడా వచ్చాయి. ఎన్నో పండుగలని మనం సంవత్సరంలో జరుపుకుంటూ ఉంటాము. పండగ పేర్లతో వచ్చిన ఈ సినిమాలు గురించి మీరు విన్నారా..? మరి పండుగ పేర్ల తో వచ్చిన సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం.

  1. విజయదశమి:

విజయదశమి సినిమా వచ్చింది. ఈ సినిమాలో హీరోగా కళ్యాణ్ రామ్ నటించాడు. ఇది తమిళ సినిమా శివకాశికి రీమేక్. అయితే ఈ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది.

2. ఉగాది:

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించి నటించిన సినిమా ఉగాది. 1997లో ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా విడుదల అయింది. పైగా ఈ సినిమాకి ఎస్వీ కృష్ణారెడ్డి ఏ మ్యూజిక్ ని కంపోజ్ చేశారు.

3. రాఖి:

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రాఖీ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాల్లో హీరోయిన్లుగా చార్మి, ఇలియానా నటించారు. కృష్ణవంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

4. సంక్రాంతి:

వెంకటేష్ శ్రీకాంత్ హీరోలుగా నటించారు మంచి ఫ్యామిలీ సినిమా ఇది. ఈ సినిమాకి శివ ముప్పలనేని దర్శకత్వం వహించారు. పెద్ద హిట్ అయింది సినిమా.

Ads

5. కృష్ణాష్టమి:

కృష్ణాష్టమి పేరుతో కూడా సినిమా వచ్చింది. కృష్ణాష్టమి లో హీరోగా సునీల్ నటించాడు. ఈ సినిమా యావేరేజ్ హిట్ అయింది.

6. హోలీ:

ఉదయ్ కిరణ్ రిచా కలిసి ఈ సినిమాలో నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఇది కానీ హోలీ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది.

7. దీపావళి:

తమిళ్లో రవి భావన నటించిన ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమా కి దీపావళి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.

8. దుర్గాష్టమి:

కన్నడ లోని పెద్ద యాక్టర్ల తో దుర్గాష్టమి సినిమాని తీశారు.

9. దసరా:

దసరా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. మార్చి 30న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. నాని, కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

10. భోగి మంటలు:

విజయ నిర్మల గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 1981లో ఇది విడుదల అయింది. ఈ సినిమాలో కృష్ణ గారు హీరోగా నటించారు. పెద్ద హిట్ అయింది కూడా.

Previous articleఅప్పట్లో పూట గడవడమే కష్టంగా ఉండేది… రాజమౌళి కుటుంబం ఇన్ని కష్టాలు పడ్డారా..?
Next articleపేపర్ లీక్ చేసిన ”రేణుక” బాక్గ్రౌండ్ ఏమిటి..? ఆమె గురించి చుట్టుపక్కల వాళ్ళు ఏం అంటున్నారు..?