అప్పట్లో పూట గడవడమే కష్టంగా ఉండేది… రాజమౌళి కుటుంబం ఇన్ని కష్టాలు పడ్డారా..?

Ads

దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఒక అద్భుతాన్ని సృష్టించారు. ఈ సినిమాకి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఆస్కార్ వచ్చింది అంటే ఈ సినిమా ఏ లెవెల్ లో ఉందో మీకు తెలిసే ఉంటుంది. ఆస్కార్ అవార్డు తో పాటుగా మరి కొన్ని అవార్డులు కూడా వచ్చాయి. అంతర్జాతీయ స్థాయి లో మంచి గుర్తింపుని ఈ సినిమా తెచ్చుకుంది.

ఆస్కార్ రావడానికి రాజమౌళి కీరవాణి పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే ఆస్కార్ వేదిక పై ఇప్పుడు నిలబడ్డ రాజమౌళి ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు.

నిజానికి రాజమౌళి కటిక పేదరికంతో ఎంతగానో ఇబ్బంది పడ్డారు. అలానే కీరవాణి కూడా కటిక పెదకారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఈ విషయాలను కీరవాణి తండ్రి శివ శక్తి దత్త ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఒకప్పుడు వాళ్ళ కుటుంబం అనుభవించిన పేదరికం గురించి ఆయన చెప్పారు. ఇక కీరవాణి తండ్రి శివ శక్తి దత్త పంచుకున్న విషయాలను చూద్దాం…

Ads

వాళ్ళు మొత్తం నలుగురు అన్నదమ్ములట. తుంగభద్ర తీరానికి వీళ్ళు వలస వెళ్లారట. అక్కడ వీళ్లంతా 16 సంవత్సరాలు ఉన్నామని అన్నారు. శివ శక్తి దత్త అక్కడ 300 ఎకరాల పొలం ని కొన్నారట. సినిమాలు అంటే చిన్ననాటి నుండి కూడా ఆయనకి ఇష్టమట. సినిమాలపై పిచ్చి ఉండడంతో ఆస్తులని కూడా పోగొట్టుకున్నారట. ఇలా ఆస్తులు పోవడంతో రోజు గడవడం కూడా కష్టంగా మారిందని.. కటిక పేదరికం ని ఎదుర్కొన్నాము అని శివ శక్తి దత్త తెలిపారు.

కీరవాణి వల్లే మా రోజు గడిచేది అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర కీరవాణి పని చేసి డబ్బులని సంపాదించారు అని చెప్పారు. చిన్నప్పటి నుంచి కూడా కీరవాణి కి సంగీతంపై ఆసక్తి ఎక్కువ ఉందని అన్నారు. నేను తమ్ముడు విజయేంద్ర ప్రసాద్ కథా రచయితలుగా పని చేశామన్నారు. జానకిరాముడు, కొండవీటి సింహం వంటి హిట్ మూవీస్ కి స్టోరీ ఇచ్చామని అన్నారు.

Previous articleడబ్బుల కోసం రేణుక… అమ్మాయిల పిచ్చితో ప్రవీణ్… పక్కా ప్లాన్ తో…
Next articleపండుగల పేర్లతో వచ్చిన 10 తెలుగు సినిమాల గురించి తెలుసా ? ఎన్ని ఉన్నాయి ? ఎప్పుడొచ్చాయి ?