Ads
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్స్ ఇచ్చి, వాళ్ల అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించి, ఎంతో పాపులారిటీ పొందిన కొంతమంది హీరో హీరోయిన్స్ అనికొని కారణాల వల్ల హఠాత్తుగా కన్నుమూశారు. అలాంటి వారు మరణించినపుడు వారి ఫ్యాన్స్ ఎంత ఆవేదన చెందుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Ads
అయితే సడన్ గా చనిపోయిన స్టార్స్ అప్పటికే నటించి ఉన్న మూవీస్, వారి మరణానంతరం రిలీజ్ అయ్యాయి. అలా హీరో హీరోయిన్స్ మరణించిన తరవాత రిలీజ్ అయిన చిత్రాలు ఏమిటో చూద్దాం..1.పునీత్ రాజ్ కుమార్
గత ఏడాది గుండె పోటుతో కన్నుమూసిన హీరో పునీత్ రాజ్ కుమార్, జీన్స్ సినిమా షూటింగ్ తొంబై శాతం షూటింగ్ పూర్తి చేసాడు. హఠాత్తుగా పునీత్ మరణించడంతో ఆ మూవీని డబ్బింగ్ లేకుండానే విడుదల చేశారు.2.సుషాంత్ సింగ్ రాజ్ పుత్
బాలీవుడ్ యువ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య, అందరిని షాక్ అయ్యేలా చేసింది. సుషాంత్ చనిపోయేసమయానికి దిల్ బేచారా అనే సినిమాని పూర్తి చేసాడు. ఇక ఈ మూవీ సుషాంత్ మరణించిన నాలబై రోజులకి రిలీజ్ చేయగా, సూపర్ హిట్ గా అయ్యింది. ఆయన ఫ్యాన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు.3. అక్కినేని నాగేశ్వరరావు
అలనాటి అగ్ర హీరో అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ తో చాలాకాలం బాధపడ్డారు. ఆ సమయంలో మనం అనే సినిమాలో నటించారు. అందులో అక్కినేని ఫ్యామిలీ సభ్యులు నటించారు. ఈ సినిమా ఆయన చనిపోయిన తరవాత విడుదలఅయ్యి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకి మధుర జ్ఞాపకంగా నిలిచింది.4.దివ్య భారతి
టాలీవుడ్ బాలీవుడ్ లో అగ్ర నటిగా వెలుగొందుతున్న టైమ్ లోనే దివ్య భారతి అర్థాంతరంగా మరణించింది. దివ్య భారతి చనిపోయేనాటికే తొలిముద్దు మూవీ షూటింగ్ ను పూర్తి చేసింది. దీంతో ఆమె చనిపోయిన తరవాత ఈ మూవీని విడుదల చేశారు.5.సౌందర్య
మహానటి సావిత్రి తరువాత అంతటి పేరు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య ఊహించని విధంగా విమాన ప్రమాదంలో కన్నుమూసింది. సౌందర్య అప్పటికే ఆప్తమిత్రుడు, శిశశంకర్ సినిమాల షూటింగ్ పూర్తి చేయడంతో ఈ రెండు చిత్రాలు ఆమె మరణించిన తరవాత రిలీజ్ అయ్యాయి.6.ప్రత్యూష
హీరోయిన్ గా ఎంతో భవిష్యత్తు ఉన్న ప్రత్యూష అర్థాంతరంగా చనిపోయింది. ఇక ఆమె చనిపోయేనాటికే సౌండ్ పార్టీ అనే సినిమాను పూర్తి చేసింది. ఈ మూవీని ఆమె చనిపోయిన 2 ఏళ్ల తరవాత రిలీజ్ చేసినా భారీ రెస్పాన్స్ వచ్చింది.
Also Read: కాంతార సినిమాకి సాయి ధరమ్ తేజ్ ”విరూపాక్ష” సినిమాకి మధ్య లింక్ ఏమిటి..?