రాహుల్‌, స్టాలిన్, జయలలితలతో పోటీ చేసి…ఇప్పుడు కేసీఆర్ తో కూడా పోటీ చేస్తున్న ఈ ఎలక్షన్ కింగ్ ఎవరో తెలుసా.?

Ads

ఎన్నికలు సమీపిస్తున్నాయి. నాయకులు అందరూ కూడా ప్రచారాల పనిలో ఉన్నారు. నామినేషన్స్ లో కూడా ఈసారి ఎన్నో రకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ ఒక వ్యక్తి మాత్రం ఎలాంటి ఎన్నికలు ఉన్నా కూడా అందులో పోటీ చేస్తూనే ఉన్నారు. ఆయన పద్మరాజన్. ఈ వ్యక్తి ఒక హోమియోపతి డాక్టర్.

ఈయన చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం ఈ పద్మరాజన్ కేసీఆర్ కి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. ఈయనకి ఒక రికార్డ్ కూడా ఉంది. అదేంటంటే, ఈయన చాలా ఎక్కువ సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. అంతే ఎక్కువ సార్లు ఎన్నికల్లో ఓడిపోయారు కూడా.

padmarajan contesting opposite kcr

ఈ రకంగా రికార్డ్ లోకి ఎక్కారు. పద్మరాజన్ 1986 లో తన సొంత నియోజకవర్గమైన మెట్టూరులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డారు. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నుండి వార్డ్ మెంబర్ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలో ఈయన పోటీ చేశారు. పద్మరాజన్ 72 అసెంబ్లీ ఎన్నికలు, 50 రాజ్యసభ ఎన్నికలు, 32 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది మాత్రమే కాకుండా, 5 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, 5 రాష్ట్రపతి ఎన్నికలతో పాటు 3 సార్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు.

padmarajan contesting opposite kcr

Ads

ఈ సారి మాత్రం కేసీఆర్ కి వ్యతిరేకంగా నామినేషన్ వేశారు. ఇది పద్మరాజన్ వేసిన 237 వ నామినేషన్ అవ్వడం విశేషం. రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నికలలో పోటీ చేయడానికి పద్మరాజన్ దాదాపు 20 లక్షల రూపాయలను ఖర్చు చేసినట్టు సమాచారం. ఇవి మాత్రమే కాదు. పద్మరాజన్ పీవీ నరసింహారావుకి వ్యతిరేకంగా కూడా పోటీ చేశారు. అప్పుడు ఈయన మీద దాడి కూడా జరిగిందట.

padmarajan contesting opposite kcr

స్టాలిన్, జయలలిత, కరుణానిధి, యడ్యూరప్ప, పళని స్వామి, ఎస్ఎం కృష్ణ వంటి నాయకులకు వ్యతిరేకంగా కూడా పద్మరాజన్ పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కూడా ఈయన పోటీ చేశారు. కానీ నామినేషన్ దాఖలు చేయడానికి తప్ప ప్రచారం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పద్మరాజన్ కి ప్రజలు అభిమానంతో ముద్దుగా ఒక పేరు కూడా పెట్టుకున్నారు. అదే ఎలక్షన్ కింగ్. ఈ పేరు పెట్టుకోవడానికి కూడా ఒక కారణం ఉంది అదేంటంటే, ఇన్ని సంవత్సరాలు ఓటమిని లెక్క చేయకుండా ఎన్నికల్లో పాల్గొంటున్నందుకు పద్మరాజన్ ని అందరూ ఎలక్షన్ కింగ్ అని పిలుస్తారు.

ALSO READ : తెలంగాణలో “జనసేన” ఇలా చేస్తున్నారు..? మరి “ఆంధ్రప్రదేశ్” సంగతి ఏంటి..?

Previous articleభార్యకి అంబానీ గిఫ్ట్ గా ఇచ్చిన ఈ కార్ ధర ఎంతో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..! దీని ప్రత్యేకత ఏంటంటే.?
Next articleఇందుకేగా మిమ్మల్ని తిట్టేది… ఇండియా గెలుపుని ఓర్వలేక ఈ పాక్ ప్లేయర్ ఏమన్నాడు అంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.