Ads
సినీ పరిశ్రమలో వారసత్వం అనేది ఎప్పటి నుండో వస్తున్న విషయం. ఇండస్ట్రీలోకి ఒకరు అడుగు పెట్టి, గుర్తింపు సంపాదించుకుని నిలదొక్కుకున్న తరువాత వారి కుటుంబం నుండి ఇండస్ట్రీకి వారసులుగా వచ్చి కెరీర్ కొనసాగిస్తున్నవారు చాలామంది ఉన్నారు.
ముఖ్యంగా హీరోలు ఇండస్ట్రీలో అగ్రస్థానం చేరుకున్న తరువాత వారి తమ్ములు లేదా కొడుకులను హీరోలుగా చేస్తారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నవారిలో సగం మంది పైగా అలా వచ్చినవారే. కొందరు హీరోలు తమ కొడుకులను హీరోగా చేస్తే, మరికొందరు వారి తమ్ములను హీరోలుగా చేసారు.
Ads
తెలుగు ఇండస్ట్రీకి సోగ్గాడు, అందమైన నటనకు ప్రతిరూపం అయిన హీరో శోభన్ బాబు. గ్లామర్ హీరోగా ఎంతో పాపులర్ అయినా కూడా శోభన్ బాబు డీ గ్లామర్ పాత్రలలోనూ మెప్పించారు. ఎక్కడ ప్రారంభించాలో అలాగే దాన్ని ఎక్కడ ఆపాలో తెలుసుకుని ఆచరించడం అనేది కొందరికి మాత్రమే మాత్రమే సాధ్యం అవుతుంది. అలా శోభన్ బాబుకు సాధ్యమైంది.
శోభన్ బాబు హీరోగా సినిమాల్లోకి వచ్చి, తక్కువ కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగారు. అయితే ఆయనకు స్టార్ డమ్ ఉన్నప్పటికి కూడా మిగిలిన హీరోల వలె తన కుమారుడిని శోభన్ బాబు ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. మొదటి నుండి కూడా ఫ్యామిలిని సినీ ఇండస్ట్రీకీ దూరంగానే ఉంచాడు. అయితే శోభన్ బాబు అలా ఎందుకు చేసేవాడో అప్పుడు ఎవరికి తెలియదు. అయితే ఇన్నేళ్ల తరువాత ఆ విషయం ఇప్పుడు తెలిసింది.
నటుడు రాజా రవీంద్ర తాజాగా ఒక ఇంటర్వ్యూలో సీనియర్ హీరో శోభన్ బాబు గురించి ఇలా చెప్పుకొచ్చాడు. నేను ఆయనతో ఒకసారి సార్ మీ అబ్బాయిని హీరోగా చేయరా అని అడిగినపుడు, ఆయన హీరోగా నేను టెన్షన్ పడుతూ, అంతగా టెన్షన్ పెడుతున్నాను. అందుకే ఈ టెన్షన్స్ నా కుమారుడికి అవసరం లేదని అనిపించింది. అందువల్లనే మా అబ్బాయిని సినీ పరిశ్రమకు దూరంగా ఉంచానని శోభన్ బాబు తెలిపారని యాక్టర్ రాజా రవీంద్ర తెలియచేశారు.
Also Read: తారకరత్న గురించి ఎన్టీఆర్ ‘అమిగోస్’ ఈవెంట్‌లో మాట్లాడకపోవడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?