హనుమకొండ హాస్పటల్ లో ఠాగూర్ సినిమా హాస్పిటల్ సీన్ రిపీట్.. రూ.16 లక్షల బిల్..!

Ads

సాధారణంగా ఆరోగ్య విషయంలో సామాన్య ప్రజలు భయపడుతూనే ఉంటారు. గవర్నమెంట్ ఆస్పత్రులకు వెళ్తే అక్కడ సరైన ట్రీట్మెంట్ అందుతుందో లేదో అనే సందేహం. అక్కడ మౌలిక సదుపాయాలు ఎలా ఉంటాయనేది  ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

Ads

ఇక ప్రైవేటు హాస్పటల్ కి వెళ్తే లక్షలలో బిల్లు వేస్తారనే భయం. ఈ మధ్యకాలంలో ప్రైవేటు హాస్పటల్ లలో దోపిడీకి అదుపు అనేది ఉండట్లేదని పేషెంట్లు వాపోతున్నారు. అనారోగ్యం వచ్చిందంటే చాలు అందినంతవరకు దోచుకుంటున్నారని బాధితులు అంటున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి నటించిన ఠాగూర్ మూవీలో చూపించినట్లు మరణించిన వ్యక్తికి బతికిస్తామని చెప్పి, ట్రీట్మెంట్ పేరుతో లక్షల్లో బిల్లు వేసి మోసం చేసిన ఇన్సిడెంట్స్ గురించి తరచుగా వింటూనే ఉన్నాం. అలాంటిదే వరంగల్​ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది.
ఖిలా వరంగల్​ లోని గాడిపెళ్లికి చెందిన అఖిల ఇంటర్​ తో చదివు ఆపేసి, ఇంటి దగ్గరే ఉంటోంది. అఖిలకు ఫిబ్రవరి 23న తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో, ఆ నొప్పిని  తట్టుకోలేక పురుగుల మందు తాగింది. అది తెలిసిన వెంటనే ఆమె కుటుంబ సభ్యులు హనుమకొండలో ఉన్న సిగ్మా హాస్పటల్ కి తరలించారు. వైద్యులు అఖిలను పరిశీలించిన ఆమెను ఐసీయూలో చేర్చుకున్నారు. అలా వారం పాటు అఖిలకు చికిత్స చేస్తున్నట్లుగా డాక్టర్లు చెప్తూ వచ్చారు. అఖిలను ​చూసేందుకు కూడా ఒప్పుకోలేదు. వారి దగ్గర 16 లక్షల వరకు బిల్లుగా వసూలు చేశారు. గురువారం నాడు కూడా అఖిల హెల్త్ కండిషన్ మెరుగ్గా ఉందని చెప్పారు.
ఆరోజు సాయంత్రం వరకు కూడా ​అఖిలను చూడనివ్వలేదు. దాంతో సందేహం వచ్చి  వైద్యులను గట్టిగా అడగడంతో పేషెంట్ మరణించిన విషయాన్ని తెలిపారు. దాంతో బంధువులు అంతా హస్పటల్ ముందు ఆందోళనకు దిగారు. వైద్యులు డబ్బుల కోసం చికిత్స ఇస్తున్నట్లు ఇన్ని రోజులు నటించారని, హాస్పిటల్ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లయింట్ చేశారు.

Also Read: డాక్టర్ ప్రీతి కరోనా‌ను ఎదిరించి నిలిచింది.. కానీ, వేధింపులకు బలి అయ్యింది.

 

Previous articleమంచు మనోజ్ పెళ్లి ఆ స్టార్ హీరోయిన్ లాగే చేసుకున్నాడా?
Next articleమనోజ్ టు అభిరామ్.. పెద్దవాళ్ళ సపోర్ట్ అందని 10 మంది వారసులు లిస్ట్..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.