నాగార్జున తో నాగేశ్వర రావు అంత స్ట్రిక్ట్ గా ఉండేవారా..?

Ads

అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని పునికిపుచ్చుకొని నాగార్జున తర్వాత నాగ చైతన్య అఖిల్ కూడా ఇండస్ట్రీ లోకి వచ్చి స్థిరపడ్డారు ఇప్పటికే వీళ్ళ ముగ్గురు సినిమాలు చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే వున్నారు. . నాగర్జున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నాగార్జున అప్పటినుండి ఇప్పటి వరకు అదే అందాన్ని మైంటైన్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. తెలుగు సినిమా తొలినాళ్ల అగ్ర నాయకుల్లో నాగేశ్వరరావు ఒకరు. 255 చిత్రాలు చేశారు ఆయన.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద ఫ్యామిలీలో అటు అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. ఎన్టీఆర్ తో కలిసి అప్పట్లో నాగేశ్వరరావు తెలుగు ఇండస్ట్రీ ని మద్రాస్ నుండి హైదరాబాద్ కి తీసుకు రావడానికి కృషి చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వీళ్ళు ఇద్దరు రెండు కళ్ళు లాంటి వారు అని కూడా సినీ విశ్లేషకులు అంటారు. అయితే ఏఎన్ఆర్ నాగార్జున విషయంలో ఎప్పుడు స్ట్రిక్ట్ గానే ఉండేవారు.

Ads

నాగార్జునకి కష్టం విలువ తెలియాలని నాగేశ్వరరావు అనుకునేవారు. కఠినంగా ఉంటూ కష్టం విలువ తెలియజేయాలని భావించారు. అందుకే అందరి పిల్లలు లాగే చూసేవారు. స్కూల్ కి ఆయన బస్సు లోనే పంపించేవారు కనీసం సైకిల్ కూడా కొని ఇవ్వలేదట. నాగార్జున కి నాగేశ్వర రావు అంటే ఎంతో భయం. సైకిల్ కోసం అడగడానికి కూడా భయ పడ్డారట. ఒక రోజు నాగార్జున ధైర్యము చేసి సైకిల్ కావాలని అక్కినేని నాగేశ్వరావుని అడిగారు.

నువ్వు మొదట ఏడవ తరగతిలో మెరిట్ మార్కులు తెచ్చుకో అప్పుడే సైకిల్ కొనిస్తానని నాగేశ్వరరావు నాగార్జున కి చెప్పారు. మామూలు పిల్లల్లాగానే నాగార్జున కూడా స్కూల్ కి వెళ్లేవాడు. కాలేజీకి కూడా అలానే వెళ్లేవారట. కోటీశ్వరుడు అని కష్టం విలువ తెలియకుండా నాగార్జున పెరిగితే చెడిపోతాడని భావించారు అక్కినేని నాగేశ్వరరావు. ఇలా కొడుకు విషయంలో నాగేశ్వరరావు కఠినంగా ఉండేవారట. అలా ఉండడం వల్లే ఏమో నాగార్జున ఇండస్ట్రీ లో సక్సెస్ఫుల్ హీరో అయ్యారు.

Previous articleసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లోని చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!
Next articleవారానికి ఏడూ రోజులే ఎందుకు ఉంటాయి? దాని వెనకున్న స్టోరీ ఇదేనా ?