పడుకుని లాప్టాప్స్ ని ఉపయోగిస్తే.. ఈ 5 సమస్యలు తప్పవు..!

Ads

టెక్నాలజీ పెరిగిపోవడంతో మనం లాప్టాప్స్, కంప్యూటర్స్ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. లాప్టాప్ చాలా అవసరంగా మారింది. మన దగ్గర లాప్టాప్ లేకపోతే పనులు కూడా జరగవు. పిల్లలు కూడా లాప్టాప్లలో చదువుకోవడం వంటివి చేస్తున్నారు. ఉద్యోగుల గురించి ఇంక చెప్పక్కర్లేదు. వర్క్ ఫ్రం హోం వచ్చినప్పటి నుండి కూడా ల్యాప్టాప్ల నుండి ఇంట్లో ఉండే ఉద్యోగులు ఉద్యోగాలనే చేస్తున్నారు. అయితే మనం ఆఫీస్ లో పని చేయాల్సి వస్తే లాప్టాప్ ని టేబుల్ మీద పెట్టుకుని పని చేస్తూ ఉంటాము కానీ వర్క్ ఫ్రం హోం రావడం వలన టేబుల్ మీద కాకుండా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు లాప్టాప్ ని ఉపయోగిస్తున్నారు.

ఇంట్లోనే కదా అని ఎవరికి నచ్చినట్లు కావాలి లాప్టాప్స్ ని వాడుతున్నారు. లాప్టాప్ ని ఉపయోగించేటప్పుడు చాలా మంది బోర్లా పడుకుని లాప్టాప్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. మీరు కూడా అలా చేస్తున్నారా అయితే కచ్చితంగా తప్పు చేసినట్లే.

Ads

పడుకుని లాప్టాప్ ని ఉపయోగించడం వలన ఈ ఇబ్బందులు తప్పవు:

#1. ఎముకల నొప్పి:

మీరు బోర్లా పడుకుని లాప్టాప్ ని ఉపయోగించినట్లయితే వెన్ను, కండరాలు సాగిపోతాయి. ఈ కారణంగా ఎముకలు నొప్పి వస్తుంది.

#2. స్పైనల్ కార్డ్ మీద ప్రభావం:

పడుకుని లాప్టాప్ ని గంటలు కొద్ది ఉపయోగించడం వలన స్పైనల్ కార్డ్ కి సంబంధించిన ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి.

#3. బ్యాక్ పెయిన్:

పడుకుని లాప్టాప్ ని ఉపయోగించడం వలన వెన్నునొప్పి వంటి ఇబ్బందులు కూడా వస్తాయి.

#4. మెడ నొప్పి:

లాప్టాప్ ని పడుకుని ఉపయోగించినట్లయితే మెడ నొప్పి కూడా రావచ్చు కాబట్టి బోర్లా పడుకుని లాప్టాప్ ని ఉపయోగించకండి.

#5. జీర్ణక్రియ పై ఎఫెక్ట్:

బోర్లా పడుకుని లాప్టాప్ ని ఉపయోగించడం వలన మీ జీర్ణ క్రియ కూడా దెబ్బతింటుంది ఇలా బోర్లా పడుకుని లాప్టాప్ ని ఉపయోగించడం వలన ఇన్ని నష్టాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి లేదంటే ఈ బాధలన్నీ వస్తాయి.

Previous articleసుంద‌ర‌కాండ సినిమా హీరోయిన్ ”అప‌ర్ణ” ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Next articleఈ తెలుగు హీరోల హైట్ ఎంతో మీకు తెలుసా..?