తెలుగు ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే బెస్ట్ పెయిర్ అనిపించుకున్న 14 జంటలు ఎవరో తెలుసా?

Ads

సిల్వర్ స్క్రీన్ పై కనిపించే హీరో హీరోయిన్స్ జోడీ చూడగానే జంట అంటే ఇలా ఉండాలి అనిపించేట్టుగా ఉండాలి. టాలీవుడ్ లో వేరే భాషా నటీనటులకు చాలా ప్రాముఖ్యతను ఇస్తారని అందరికి తెలిసిన విషయమే.

వారిలో ఒకసారి హిట్ పెయిర్ అని పేరు వచ్చిందంటే ఆ హీరోహీరోయిన్స్ జంట రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో మొదటిసారి కలిసి నటించి,ప్రేక్షకులతో బెస్ట్ పెయిర్ అని పేరు తెచ్చుకున్న 14 జంటలు ఎవరో చూద్దాం..#1.వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టి..
ఉప్పెన సినిమాతో పరిచయం అయిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు.ఈ సినిమా సంచలన విజయం సాధించిటానికి ముఖ్య కారణం ఈ జంటే.

Ads

#2.శ్రీ విష్ణు,సునయన..
రాజ రాజ చోర సినిమాలో శ్రీ విష్ణు పక్కన సునయన నటించింది. భార్యా భర్తల్లా నటించాలంటే వారి మధ్య కెమిస్ట్రీ సెట్ అవ్వాలి. ఇందులో సునయన అంతగా నటించింది.
#3.నాగ చైతన్య – సాయి పల్లవి..
లవ్ స్టోరీ సినిమాలో హీరో నాగ చైతన్య, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించారు. ఈ ఇద్దరి జోడీ ఆడియెన్స్ ను చాలా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
#4.రోషన్ – శ్రీలీల..
పెళ్లి సందD సినిమాకు మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చినా అది హిట్ అవ్వడానికి కారణం జంటగా నటించిన రోషన్, శ్రీలల మధ్య కుదిరిన కెమిస్ట్రీ మరియు కీరవాణి అందించిన పాటలు.
#5.నాగ శౌర్య – రీతూ వర్మ..
నాగ శౌర్య, రీతూ వర్మ వరుడు కావలెను సినిమాలో చక్కగా నటించిన. వీరి మధ్య కెమిస్ట్రీ కూడా చాల బాగుంది.#6.అఖిల్ – పూజా హెగ్డే..
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించి అలరించారు. అయిట్ ఈ సినిమాకు వీళ్ళ పేర్లు అనౌన్స్ చేసినపుడు చాలా విమర్శలు వచ్చాయి. విడుదలయ్యాక తెర పై అలరించింది వీరి జంట.
#7.సుధీర్ బాబు – ఆనంది..
శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో సుధీర్ బాబు తెలుగమ్మాయి ఆనంది జంటగా ఆకట్టుకున్నారు.#8.కిరణ్ అబ్బవరం – ప్రియాంక జవాల్కర్..
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంట ఎస్.ఆర్. కళ్యాణ మండపం సినిమాలో ఆడియెన్స్ ని అలరించింది. కరోనా సెకండ్ వేవ్ తరువాత వచ్చిన తొలి హిట్ ఈ సినిమానే.
#9.నాగ చైతన్య – కృతి శెట్టి..
బంగార్రాజు సినిమాలో తొలిసారి జత కట్టిన నాగ చైతన్య, కృతి శెట్టి జంటకి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ జంట మరోసారి ‘కస్టడీ’అనే ద్విభాషా జతకడుతున్నారు.#10.శర్వానంద్ – అదితి రావు హైదరీ..
శర్వానంద్, అదితి రావు హైదరీ జంటగా నటించిన సినిమా మహాసముద్రం. ఈ మూవీలో వీరి జంట ఆడియెన్స్ ను అలరించారు.
#11.విశ్వక్ సేన్ – రితిక నాయక్..
ఈ ఏడాది టాలీవుడ్ కి పరిచయమైన ఫ్రెష్ కపుల్ విశ్వక్ సేన్, రితిక నాయక్. ఈ జంట అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో అలరించారు.#12.నాగ శౌర్య – షెర్లీ సేథియా..
కృష్ణ వ్రింద విహారి సినిమాలో నటించిన నాగ శౌర్య,షెర్లీ సేథియా జంట అలరించారు.#13.నాని – నజ్రియా నజీమ్..
నేచురల్ స్టార్ నాని, మలయాళీ బ్యూటిఫుల్ హీరోయిన్ నజ్రీయా నజీమ్ జంటగా నటించిన సినిమా అంటే సుందరానికి. ఈ సినిమాలో క్యూట్ కపుల్ గా తెలుగు ఆడియెన్స్ ని అలరించారు.
#14.దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్..
ఇక ఈ ఏడాది సంచలనం సృష్టించిన సూపర్ డూపర్ జంట ఎవరంటే దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్. సీతా రామం సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్‌గా,సీతా మహాలక్షీగా మృణాల్ ఠాకూర్, ప్రేమికుడైన సైనికుడిగా దుల్కర్ సల్మాన్ జంట ఆడియెన్స్ హృదయాలలో నిలిచిపోయారు.

Also read: పూరి జగన్నాథ్ తొలి సినిమా ‘బద్రి’ గురించి ఆసక్తికర విషయాలు..

Previous articleసీనియర్ ఎన్టీఆర్ గారి పెళ్లి పత్రికను ఎప్పుడైనా చూసారా.?
Next articleరజినీకాంత్ ని బిచ్చగాడు అనుకుని మహిళ భిక్షం వేసిన వేళ..
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.