Ads
సాధారణంగా ఏదైనా ఒక సినిమా ఒక భాషలో హిట్ అయితే, మరొక భాషలో రీమేక్ చేయడం అనేది ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతున్న విషయం. ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. తెలుగులో రీమేక్ అయిన సినిమాలని వేరే భాషలో కూడా రీమేక్ చేశారు.
అలా హిందీలో సంజయ్ దత్ హీరోగా నటించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాని తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ పేరుతో రీమేక్ చేశారు. తమిళ్ లో ఇదే సినిమాని వసూల్ రాజా ఎంబీబీఎస్ పేరుతో రీమేక్ చేశారు. హిందీలో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది.
తెలుగులో కూడా చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా అంతే పెద్ద హిట్ అయ్యింది. తమిళ్ లో ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించారు. తెలుగులో ఈ సినిమాకి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. తమిళ్ లో ఈ సినిమాకి శరణ్ దర్శకత్వం వహించారు. తమిళ్ లో కూడా ఈ సినిమా మంచి విజయం నమోదు చేసుకుంది. సాధారణంగా రీమేక్ సినిమాలు అన్న తర్వాత పోలికలు అనేవి వస్తూనే ఉంటాయి. తెలుగు, తమిళ్ భాషల్లో అయితే ఈ పోలికలు చాలా ఎక్కువగా ఉంటాయి.
తెలుగులో చిరంజీవి గొప్ప నటుడు. తమిళ్ లో కమల్ హాసన్ గొప్ప నటుడు. వారి సినిమాలు రీమేక్ అయ్యాయి అంటే పోలిక అనేది కచ్చితంగా వస్తుంది. ఇద్దరిలో ఎవరు బాగా చేశారు అని కాదు. ఇద్దరిలో ఎవరు గొప్పగా చేశారు అనేది ఇక్కడ డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే ఏ పాత్రకి అయినా సరే న్యాయం చేయగల నటులు వీళ్లు. అలాంటిది ఇలాంటి పాత్రల్లో ఎలా చేస్తారు అనే ఆసక్తి అందరిలో నెలకొంటుంది. అయితే, ఇప్పుడు ఈ రెండు సినిమాలు పోల్చి చూస్తే ఎవరికి వారు బానే చేశారు.
Ads
తెలుగులో చిరంజీవి హుషారుగా చేస్తే, కమల్ హాసన్ తనదైన స్టైల్ లో తమిళ్ లో కూడా అంతే హుషారుగా చేశారు. కానీ పోల్చి చూస్తే మాత్రం, మన వారికి మన తెలుగు సినిమానే నచ్చుతుంది ఏమో. ఎందుకంటే, నేటివిటికి మన సినిమా దగ్గరగా ఉండడం మాత్రమే కాకుండా, చిరంజీవి సినిమాతో ఇంక ఏ వేరే హీరో సినిమాని కూడా పోల్చి చూడడం అనేది కష్టంగా అనిపిస్తుంది.
అది కూడా చిరంజీవి సినిమా హిట్ అయితే ఇక వేరే ఏ సినిమాతో కూడా పోలిక లేకుండా, మన సినిమానే బెస్ట్ అని అనిపిస్తుంది. తమిళ్ వాళ్లకు కూడా కమల్ హాసన్ వారి నటుడు కాబట్టి, కమల్ హాసన్ నటన కూడా చాలా బాగా అనిపిస్తుంది. అందులోనూ కమల్ హాసన్ చాలా సహజంగా నటిస్తారు అని ఒక గుర్తింపు ఉంది కాబట్టి, ఆయన నటన ఇంకా సహజంగా, ఇంకా పరిణితిగా అనిపిస్తుంది.
watch video :
ALSO READ : “ఫ్యామిలీ స్టార్” పోస్టర్‌పై కౌంటర్ వేసిన నెటిజన్ కి… “విజయ్ దేవరకొండ” రిప్లై చూస్తే నవ్వాపుకోలేరు..!