“రామ్ చరణ్” ఇప్పటి వరకు సంపాదించిన మొత్తం ఎంత..? ఒక్క సినిమాకి ఎంత తీసుకుంటారు అంటే..?

Ads

ఏదైనా ఒక ఇండస్ట్రీలో తమ తల్లిదండ్రులు గుర్తింపు తెచ్చుకున్న తర్వాత, వారి పిల్లలు కూడా వారి అడుగుజాడల్లోనే నడవడం అనేది సహజంగా జరిగే విషయం. అయితే, ఒక పాయింట్ తర్వాత తమని తాము నిరూపించుకొని వారికి సొంతంగా ఒక గుర్తింపు సంపాదించుకుంటారు.

అలా సినిమా నేపథ్యం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా, ఇప్పుడు తనకంటూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో, కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, రామ్ చరణ్ ఇప్పటి వరకు సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా, వ్యాపార రంగంలో కూడా ఇన్వెస్ట్ చేశారు. రామ్ చరణ్ ఆస్తుల విలువ 1370 కోట్లు అని తెలుస్తోంది. రామ్ చరణ్ సినిమాకి 45 కోట్ల నుండి 100 కోట్ల వరకు తీసుకుంటారు. ఏదైనా ఒక బ్రాండ్ ఎండోర్స్ చేయడానికి 2 నుండి 3 కోట్లు తీసుకుంటారు.

ram charan assets value

Ads

అలా చాలా ఎడ్వర్టైజ్మెంట్స్ లో నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. దీని ద్వారానే ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలు వచ్చాయి. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ ఓనర్ గా కూడా రామ్ చరణ్ ఉన్నారు. ట్రూజెట్ అనే ఒక ఎయిర్ లైన్ సర్వీస్ కి కో-ఓనర్ గా ఉన్నారు. 3.50 కోట్లు విలువ చేసే ఫెరారీ పోర్టోఫినో కార్, 3.2 కోట్లు విలువ చేసే ఆస్టన్ మార్టిన్ వాన్టేజ్ v8 సిరీస్ కార్, 4 కోట్లు విలువ చేసే మెర్సిడెస్ మేబ్యాక్ జిఎల్ఎస్ 600 కార్, 9.57 కోట్లు విలువచేసే రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్లు కూడా రామ్ చరణ్ దగ్గర ఉన్నాయి.

వ్యక్తిగతంగా రామ్ చరణ్ 150 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. రామ్ చరణ్ కి సోషల్ మీడియాలో కూడా ఇంస్టాగ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్లు, ట్విట్టర్ లో 3.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ప్రమోషన్ అంటే కేవలం టీవీలో వచ్చే ఎడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో కూడా ప్రచారకర్తగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి. ఫ్రూటీ, హీరో లాంటి ఎన్నో బ్రాండ్స్ కి రామ్ చరణ్ ప్రచారకర్తగా చేశారు.

ALSO READ : “అనంత్ అంబానీ” ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా..? దీనిలో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయా..?

Previous article“అనంత్ అంబానీ” ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా..? దీనిలో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయా..?
Next articleతెలుగు “శంకర్ దాదా MBBS”… తమిళ్ “శంకర్ దాదా MBBS”..! వీళ్ళిద్దరిలో ఏ “హీరో” నటన బాగుందంటే..?