“ఫ్యామిలీ స్టార్” పోస్టర్‌పై కౌంటర్ వేసిన నెటిజన్ కి… “విజయ్ దేవరకొండ” రిప్లై చూస్తే నవ్వాపుకోలేరు..!

Ads

విజయ్ దేవరకొండ హీరోగా, పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా టీజర్ నిన్న విడుదల చేశారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

గోపి సుందర్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా టీజర్ చూస్తూ ఉంటే ఇందులో విజయ్ దేవరకొండ ఒక పిసినారి పాత్రలో నటిస్తున్నారు అని అర్థం అవుతోంది. సినిమా పోస్టర్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి.

vijay devarakonda funny reply to a netizen

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పాట మంచి రెస్పాన్స్ అందుకుంది. సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఏప్రిల్ లో విడుదల చేస్తున్నారు. సినిమా బృందం ఇంక ప్రమోషన్స్ కూడా మొదలు పెడుతున్నారు. అయితే, సినిమా టీజర్ రిలీజ్ చేసే ముందు సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేశారు. అందులో విజయ్ దేవరకొండ క్రాక్స్ అనే ఒక బ్రాండ్ కి సంబంధించిన చెప్పులు వేసుకొని కనిపించారు.

Ads

vijay devarakonda funny reply to a netizen

ఈ చెప్పులు ఖరీదు వేలల్లో ఉంటుంది. ఇదే ప్రశ్నని సోషల్ మీడియాలో ఒక నెటిజన్ అడుగుతూ, “క్రాక్స్ వేసుకుని మిడిల్ క్లాస్ అంట. సూపర్ అన్నా” అని అన్నారు. అందుకు విజయ్ దేవరకొండ కూడా రిప్లై ఇచ్చారు. “సేల్ లో కొన్నా 70% ఆఫ్ లో” అని రిప్లై ఇచ్చారు. విజయ్ దేవరకొండ ఇచ్చిన ఫన్నీ రిప్లై చూసి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర ఎలా ఉండబోతోంది అని ప్రేక్షకులు అంచనా వేయడం మొదలు పెట్టారు.

vijay devarakonda funny reply to a netizen

టీజర్ లో హీరోయిన్ తనని కాలేజ్ వరకు దింపమంటే, “పెట్రోల్ కొట్టిస్తే దింపుతాను” అంటూ హీరో చెప్తాడు. అంటే, ఈ సినిమాలో హీరో మిడిల్ క్లాస్ అతను మాత్రమే కాకుండా, పిసినారి కూడా అని ఇండైరెక్ట్ గా చెప్పారు. సినిమా గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలియాలి అంటే మాత్రం ట్రైలర్ విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే.

ALSO READ : కీరవాణి, రాజమౌళి అన్నదమ్ములే కదా..? మరి పేర్ల ముందు అక్షరాలు ఎందుకు వేరేగా ఉంటాయి..?

Previous articleబాలకృష్ణ కూతుళ్లు సినిమాల్లోకి ఎందుకు రాలేదు..? కారణం ఇదేనా..?
Next article“అనంత్ అంబానీ” ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా..? దీనిలో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయా..?