ఒక పెళ్ళికి ఇన్ని కోట్లు ఎందుకు వేస్ట్…దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇది ఆలోచించండి.! నిజమే అంటారా?

Ads

భారతదేశపు అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి ఒకటి నుంచి మూడవ తేదీ వరకు గుజరాత్ లోని జాంనగర్ లో అంగరంగ వైభవంగా జరిగాయి.

ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో బిల్ గేట్స్, మార్క్ జుగర్ బర్గ్ తో పాటు బాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఈ పెళ్ళికి హాజరు అయ్యారు.

gifts to ambani daughter in law

పెళ్లి కోసం ముఖేష్ అంబానీ 1000 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహం. ఖర్చులో ఎక్కువ భాగం అలంకరణలు, ప్రత్యక్ష ప్రదర్శనల కోసం ఖర్చు చేస్తున్నారు. మూడు రోజులకు భోజనాలు ఖర్చు 200 కోట్ల పైనే అని తెలిసింది. అతిథులకు ఏర్పాట్లతో పాటు వేడుక కోసం ప్రత్యేకంగా సెట్టింగులు వేయించి మరీ ఈ వేడుకను నిర్వహించారు. అన్నదానంతో మొదలైన వేడుకలకు హస్తాక్షర్ తో ముగింపు పలికారు.

age difference between anant ambani and radhika merchant

Ads

ఈ వేడుకలో రెండు గంటల పాటు ఆడి పాడినందుకు పాప్ సింగర్ రిహనా కు ఏకంగా 52 కోట్లు చెల్లించారంట. సినిమా సెట్టింగ్ లను తలపించేలా వేసిన సెట్టింగులు, అతిధుల కోసం ఫైవ్ స్టార్ హోటల్ ను మరిపించేలా చేసిన ఏర్పాట్లకు మొత్తంగా కలిపి ఈ వేడుకకు ముకేశ్ అంబానీ అక్షరాల 1260 కోట్లు ఖర్చు పెట్టాడని ఒక అంచనా. ఇంకా ఎక్కువ ఖర్చే అయి ఉండవచ్చు అంటున్నారు ఆర్థిక నిపుణులు.

అయితే ఈ పెళ్లి వేడుకలు చూస్తున్న సామాన్య జనం మాత్రం కొడుకు పెళ్లికి అంత ఖర్చు అవసరమా, ఒక పూట తిండికి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వారి కోసం ఉపయోగించవచ్చు కదా, ముఖేష్ తలుచుకుంటే కొడుకు పెళ్లి కోసం ఖర్చుపెట్టిన డబ్బుతో దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చేయగలడు అంటున్నారు. కానీ మరి కొందరు మాత్రం అతను సంపాదించుకున్నాడు ఖర్చు పెట్టుకుంటున్నారు మధ్యలో మీకేంటి అన్నట్లు మాట్లాడుతున్నారు.

ALSO READ : విదేశాల్లో బ్యాన్ చేసినా… మన దేశంలో ఈ 13 ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు తెలుసా..?

Previous articleతెలుగు “శంకర్ దాదా MBBS”… తమిళ్ “శంకర్ దాదా MBBS”..! వీళ్ళిద్దరిలో ఏ “హీరో” నటన బాగుందంటే..?
Next articleఅంబులెన్సు కి “108” నెంబర్ ఎందుకు పెట్టారు..? సైన్స్ ఏం చెబుతోంది..? హిందూ ధర్మం ఏం చెబుతోంది..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.