ది కేరళ స్టోరీలో నటించిన ఈ నలుగురు హీరోయిన్స్ ఎవరు..? ఈ విషయాలు మీకు తెలుసా..?

Ads

ది కేరళ స్టోరీ సినిమా ఇప్పుడు సంచలనంగా మారింది. ది కేరళ స్టోరీ సినిమా ఓటిటి రిలీజ్ పై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో ఆదాశర్మ ప్రధాన పాత్ర పోషించారు. మే 5న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. మలయాళం తో పాటుగా తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి వచ్చింది. లవ్ జిహాద్ అంశంపై ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా మీద వివాదాలు కొనసాగుతున్నాయి ఈ సినిమాని 32 వేల మంది మహిళల జీవితం ఆధారంగా తీసుకువచ్చినట్లు డైరెక్టర్ ముందు చెప్పారు. ఆ తరవాత ముగ్గురు యువతల జీవితము ఆధారంగానే సినిమాని నిర్మించామని చెప్పారు. అయితే భద్రతాపరమైన కారణాలతో ఈ సినిమాని తమిళనాడు, బెంగాల్ తో పాటుగా పలుచోట్ల నిలిపివేశారు. ఈ సినిమా రాజకీయ సెగలు కూడా రేపుతోంది.

కానీ కలెక్షన్లు మాత్రం గట్టిగా వచ్చాయి. థియేటర్లలో వివాదాలు, షోలు క్యాన్సిల్ చేస్తుండడంతో ఓటీటీ మీద అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. జీ ఫైవ్ ఏ సినిమా హక్కుల్ని సొంతం చేసుకుంది. అయితే ఇక ఇంతకీ ఇది కేరళ స్టోరీ లో నటించిన ఈ నలుగురు హీరోయిన్లు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

ఈ సినిమాలో మెయిన్ రోల్ లో అదా శర్మ నటించారు. ఈ సినిమాతో ఆమె స్థాయి ఊహించని రేంజ్ కి వెళ్ళింది ఆదాశర్మ కి ఎప్పుడు రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది. ఇందులో ఈమె శాలిని ఉన్నికృష్ణన్ రోల్ లో నటించి అందర్నీ ఆకట్టుకుంది.

ఈ సినిమాలో యోగితా బిహాని నిమా అనే పాత్ర చేసింది. ఈ ఢిల్లీ అమ్మాయి ఊహించిన స్థాయిలో పాపులారిటీని షోలు ద్వారా సొంతం చేసుకుంది. పలు సినిమాలు కూడా చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో చేసింది. అలానే గీతాంజలి పాత్రలో సిద్దు ఇదానీ నటించింది.

శ్రీనివాస్ రెడ్డి హీరోగా వచ్చిన జంబలకిడిపంబ సినిమాలో ఈమె నటించింది. అసిఫా పాత్రని సోనియా చేసింది సోనియా బలనీ టీవీ షోలు సినిమాలు ద్వారా డాన్సర్ గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఇలా ఈ నలుగురు కూడా ఈ సినిమాలో నటించారు.

Previous articleరవితేజ భార్యని మీరు ఎప్పుడైనా చూసారా..? ఆమె ఎవరు అంటే..?
Next articleఅప్పుడు ఏమో “విక్రమ్” కి కూతురుగా… ఇప్పుడు ఏమో క్రష్ గా… ఈమెని గుర్తు పట్టారా..?