అప్పుడు ఏమో “విక్రమ్” కి కూతురుగా… ఇప్పుడు ఏమో క్రష్ గా… ఈమెని గుర్తు పట్టారా..?

Ads

మంచి కథతో చక్కటి విజువల్స్ తో భారీ హంగులతో సినిమాని రూపొందిస్తే ఏ భాష వాళ్ళైనా సరే సినిమా చూస్తారని బాహుబలి సినిమాతో ప్రూవ్ అయింది. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో చక్కగా పాన్ ఇండియా లెవెల్ లో బాహుబలి సినిమాని తీసుకువచ్చారు. ఈ సినిమా కి ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాని చూసి చాలా మంది ఫిలిం మేకర్స్ ఇలాంటి కథను తీసుకురావాలని..

ఇలాంటి సినిమాలు తీసుకువస్తే బాగుంటుందని అటువంటి ప్రాజెక్టులను తెరమీదకి తీసుకురావడం జరుగుతోంది. ఆ ధైర్యం తో మణిరత్నం కూడా పోనియం సెల్వన్ సినిమాని తీసుకువచ్చారు. కల్కి కృష్ణమూర్తి రచించిన పోనియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు నిజానికి ఈ సినిమాని తీసుకు రావాలని నాలుగు దశాబ్దాల నుండి చూస్తున్నారు.

దీనిని రెండు భాగాలుగా తీసుకు రావాలని మణిరత్నం భావించారు. అలా మణిరత్నం అనుకున్నట్టుగానే పోనియన్ సెల్వన్ 1, 2 కూడా తీసుకువచ్చారు. తమిళ్ తో పాటుగా ఈ సినిమా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళ భాషలలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వరరాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, విక్రమ్, శోభిత దూళిపాళ తదితరులు నటించారు.

Ads

ఈ సినిమాలో విక్రమ్ ఎంతో అద్భుతంగా నటించారు విక్రమ్ నటన గురించి కొత్తగా మనం చెప్పుకోక్కర్లేదు. చాలా సినిమాల్లో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో చక్కగా నటించి ప్రశంసలని దక్కించుకున్నాడు విక్రమ్. విక్రమ్ కి నటన అంటే ఎంతో ఇష్టం అందుకే భిన్నంగా ఉండే పాత్రలని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. టాప్ తమిళ హీరోల్లో విక్రమ్ కూడా ఒకరు. ప్రేక్షకులు ఎలాంటి పాత్రలని తననుండి కోరుకుంటారో అటువంటి పాత్రలని ఎప్పుడూ విక్రమ్ ఎంచుకుంటూ ఉంటాడు.

సెట్ మీద కూడా ఎంతో సరదాగా ఉంటూ ఉంటాడు. అయితే విక్రమ్ నటించిన నాన్న సినిమా మీకు గుర్తుండే ఉంటుంది ఆ సినిమాలో విక్రమ్ కి కూతురుగా ఒక చిన్న పాప నటించింది. ఆ పాప పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమాలో విక్రమ్ క్రష్ కింద నటించింది ఈమె ఐశ్వర్యరాయ్ చిన్ననాటి పాత్ర చేసింది. అయితే అప్పుడు కూతురుగా ఇప్పుడు క్రష్ గా నటించడంతో పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి.

Previous articleది కేరళ స్టోరీలో నటించిన ఈ నలుగురు హీరోయిన్స్ ఎవరు..? ఈ విషయాలు మీకు తెలుసా..?
Next articleకేజీఎఫ్ లో ఈ సీన్ చూసారా ..? దీని వెనుక ఇంత అర్థమా..?