టాలీవుడ్ లో విలన్ గా అడుగు పెట్టి, ఆ తరువాత స్టార్ హీరోలు మారినవారు.. వీళ్ళే..!

Ads

తెలుగు సినీ పరిశ్రమలో నటులు కావాలనే కోరికతో ఎంతో మంది వస్తుంటారు. అయితే అవకాశాలు రావడం అనేది చిన్న విషయం కాదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, వాటి అన్నిటిని దాటుకుని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపర్చుకుని కొంత మంది మాత్రమే నటులుగా స్థిరపడతారు.

కొంతమంది నటులు వారి కెరీర్ ను విలన్ గా ప్రారంభించి, ఆ తరువాత స్టార్ హీరోలుగా మారినవారు ఉన్నారు. ఇక టాలీవుడ్ లో విలన్ గా అడుగు పెట్టి, హీరోలుగా ఎదిగినవారు కొద్ది మంది ఉన్నారు.మరి విలన్స్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఎదిగినవారు ఎవరో ఇప్పుడు చూద్దాం.కృష్ణంరాజు: రెబల్ స్టార్ గా పేరు గాంచిన కృష్ణంరాజు మొదట్లో నేనంటే నేనే, భ‌లే మాస్టర్ లాంటి చిత్రాల్లో విలన్ గా నటించి, ఆ తర్వాత హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసారు.
చిరంజీవి: కుక్కకాటుకు చెప్పు దెబ్బ, న్యాయం కావాలి, మోసగాడు, 47 రోజులు వంటి చిత్రాల్లో నటించి, విలన్ గా గుర్తింపు పొందిన చిరంజీవి, ఆ తరువాత హీరోగా చిన్న సినిమాలలో చేస్తు ఖైదీ మూవీతో స్టార్ డమ్ వచ్చింది. వరుస హిట్స్ ఇస్తూ మెగాస్టార్ స్థాయికి ఎదిగారు.రజినీకాంత్: కథా సంగమం,జాన్, బాలు లాంటి కన్నడ చిత్రాల్లో విలన్ గా నటించి, ఆ తరువాత కోలీవుడ్, టాలీవుడ్ లో హీరోగా మారి, సౌత్ ఇండియాన్ సూపర్ స్టార్ అయ్యారు.మోహన్ బాబు: అప్పట్లో టాప్ హీరోల చిత్రాల్లో నటించి, టాప్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత అల్లుడు గారు మూవీతో హీరోగా మారి, కలెక్షన్ కింగ్ అయ్యారు.
శ్రీహరి: రౌడీ ఇన్స్పెక్టర్, ముఠా మేస్త్రి, కలసుందాం రా, ప్రేమంటే ఇదేరా లాంటి ఎన్నో చిత్రాల్లో విలన్ గా చేసిన శ్రీహరి పోలీసు మూవీతో హీరో అయ్యారు.
రాజశేఖర్: తలంబ్రాలు మూవీలో విలన్ గా నటించి, ఆ తరువాత ఆహుతి, అంకుశం చిత్రాలలో హీరోగా నటించి యాంగ్రీ యంగ్ మాన్ అయ్యారు.శ్రీకాంత్: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అబ్బాయి గారు, వారసుడు లాంటి సినిమాలలో విలన్ గా నటించిన శ్రీకాంత్, ఆ తర్వాత కొన్ని సినిమాలలో సైడ్ హీరో పాత్రలు చేస్తూ, పెళ్లి సందడి మూవీతో స్టార్ హీరోగా మారారు.
జెడి చక్రవర్తి: శివ చిత్రంతో విలన్ గా పరిచయమైన జెడి, చిన్న చిన్న విలన్ పాత్రలలో నటిస్తూ, గులాబి మూవీతో హీరో అయ్యారు.

Ads

గోపీచంద్: తొలివ‌ల‌పు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ అవడంతో విలన్ గా మారి నిజం, వర్షం, జయం వంటి చిత్రాల్లో తన విలనిజంతో భయపెట్టాడు. ఆ తరువాత హీరోగా విజయం పొందాడు.

Also Read: టాలీవుడ్ లో సర్జరీ చేయించుకున్న10 మంది స్టార్ హీరోయిన్స్..

Next article1947-2021మన దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులు ఎవరు ఎలా పని చేసారు ? అత్యంత నిజాయితీ పరుడు ఎవరు ?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.