1947-2021మన దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులు ఎవరు ఎలా పని చేసారు ? అత్యంత నిజాయితీ పరుడు ఎవరు ?

Ads

ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి పదవి ఉన్నతమైనది. అయినా కూడా రాష్ట్రపతి అధికారులు కేవలం నామ మాత్రం. వాస్తవానికి అధికారాలన్నీ ప్రధానమంత్రి మంత్రి వర్గం వద్దే ఉంటాయి లోక్ సభ లో మెజారిటీ ఉన్న పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారు. స్వాతంత్రం తర్వాత 14 మంది ప్రధాన మంత్రులుగా పని చేశారు. జవహర్ లాల్ నెహ్రూ నాలుగు సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు.

ఇందిరాగాంధీ మూడుసార్లు, అటల్ బిహారీ వాజ్పేయి మూడుసార్లు పని చేయగా గుల్జారీ లాల్ నందా రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారు. నరేంద్ర మోడీ రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యారు. 1947 నుండి 2021 దాకా మన దేశాన్ని పరిపాలించిన ప్రధాన మంత్రులు ఎవరు ఎలా పని చేశారు… అత్యంత నిజాయితీపరుడు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

1.జవహర్లాల్ నెహ్రూ:  (ఆగష్టు 15, 1947 మే 27, 1964 )

దేశాన్ని దాదాపు 16 ఏళ్లకు పైగా పాలించారు నెహ్రూ. పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు ఉంటాయని జవహర్ లాల్ నెహ్రూ ఆ దిశలో నడిచారు. కంపెనీలను ఏర్పాటు చేశారు. నెహ్రూ సైన్స్ కూడా అభివృద్ధి చెందాలని ఐఐటీలను ప్రారంభించారు.

2.గుల్జారి లాల్ నంద: ( మే 27, 1964 జూన్ 9, 1964 )

ఈయన కేవలం 13 రోజులు యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ గా పని చేశారు. భారత జాతీయ రాజకీయనాయకుడుగా ఆర్థికవేత్తగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. కార్మిక సమస్యలపై ప్రత్యేకంగా కృషి చేసారు ఈయన. రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా పని చేసారు.

3.లాల్ బహుదూర్ శాస్త్రి: (జూన్ 9, 1964 జనవరి 11, 1966)

తర్వాత లాల్ బహుదూర్ శాస్త్రి వచ్చారు ప్రపంచంలోనే అత్యంత నిజాయితీపరుడైన మనిషి లాల్ బహదూర్ శాస్త్రి. ప్రధానిగా ఉన్నా కూడా తన సొంత డబ్బులతోనే అవసరమైనవి కొనుగోలు చేసేవారు పేదల కోసం ఎంతగానో శ్రమించారు ఈయన.

4.ఇందిరాగాంధీ: (జనవరి 24, 1966 మార్చి 24, 1977)

తర్వాత ఇంద్ర గాంధీ వచ్చారు దేశంలో బ్యాంకులను జాతీయం చేసి బ్యాంకింగ్ వ్యవస్థని బలోపేతం చేశారు ఇందిరా గాంధీ. ఇంత నిజాయతీగా బ్యాంకులు పనిచేస్తున్నాయంటే దానికి కారణం ఆమెనే. అలానే కోట్ల కొద్ది ఇళ్ళని కూడా ఆమె నిర్మించారు. ఆమె ఉన్నప్పుడు పాకిస్తాన్ భారతదేశం వైపు చూడడానికి కూడా భయపడేది.

5.మొరార్జీ దేశాయి:  (మార్చి 24, 1977 జూలై 28, 1979)

ఇందిరా గాంధీ తర్వాత రెండేళ్ల పాటు పనిచేశారు. జనతా పార్టీ నాయకుడు ఈయన. 1977 మార్చి 24 నుండి 1979 జూలై 26 దాకా భారతదేశ 4వ ప్రధానిగా సేవలని అందించారు. దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.

6.చరణ్ సింగ్: (జూలై 28, 1979 జనవరి 14, 1980)

1979 నుండి 80 దాకా చరణ్ సింగ్ వున్నారు. 1960లో హోమ్, వ్యవసాయశాఖా మంత్రిగా చరణ్ సింగ్ పని చేసారు. అలానె 1962-63లో వ్యవసాయ, అటవీ శాఖా మంత్రిగా పని చేసారు. 1966లో స్థానిక స్వయంపరిపాలనా శాఖకు మంత్రిగా పని చేసారు. 1967లో చరణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి భారతీయ క్రాంతి దళ్ పార్టీని మొదలు పెట్టారు.

7.ఇందిరా గాంధీ: (జనవరి 14, 1980 అక్టోబర్ 31, 1984)

ఇందిరా గాంధీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యారు. సొంత బాడీ గార్డ్లే ఆమెని చంపేశారు. మొదటి హంతకుడు బియాంత్ సింగ్. ఇందిరా గాంధీ భద్రతా సిబ్బందిలో ఒకరు. ఆమెకు 10 సంవత్సరాలుగా అతను తెలుసు. రెండవ హంతకుడు సత్వంత్ సింగ్ హత్య జరిగే నాటికి 22 ఏళ్ళు ఉంటాయంటే. హత్య చేసిన ఐదు నెలల ముందే బాడీ గార్డ్ గా చేరాడు.

8.రాజీవ్ గాంధీ: (అక్టోబర్ 31, 1984 డిసెంబర్ 2, 1989)

Ads

రాజకీయాల్లో ఆసక్తి లేకపోయినా రాజీవ్ గాంధీ అందరి కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చి ప్రధానమంత్రిగా పని చేశారు. టెక్నాలజీ అంటే ఆయనకి చాలా ఇష్టం కంప్యూటర్లు ప్రపంచాన్ని శాసిస్తాయని ఆయన గ్రహించారు. సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి బెంగళూరులో విదేశీ కంపెనీలను ఏర్పాటు చేశారు.

9.వీపి సింగ్: (డిసెంబర్ 2, 1989 నవంబర్ 10, 1990)

ఆయన రైతులు కోసం కష్టపడ్డారు. ఏడవ ప్రధానమంత్రిగా 1989 నుండి 1990 దాకా ఈయన పని చేసారు. ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన కులాలకు 27% రిజర్వేషన్ కల్పించాలని మండల్ కమిషన్ నివేదిక ప్రకారం చూసారు ఈయన.

10.చంద్రశేఖర్: (నవంబర్ 10, 1990 జూన్ 21, 1991)

భారత దేశపు 11వ ప్రధానమంత్రి ఈయన. 1990 నవంబరు 10 నుండి 1991 జూన్ 21 వరకు తన సేవలనందించారు. పాదయాత్ర తో దేశ ప్రజలను ఆకర్షించి చివరి దాకా కూడా ప్రజాసమస్యల కోసమే పని చేసి చరిత్రలో నిలిచారు.

11.పీవీ నరసింహారావు: (జూన్ 21, 1991 మే 16, 1996)

దేశం ఘోర పరిస్థితిలో ఉన్నప్పుడు పివి నరసింహారావు వచ్చారు. దేశం కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. పాములపర్తి వేంకట నరసింహారావు ఒక న్యాయవాది. ఇండియా కి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పని చేసారు. పి.వి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాదు కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని పొందారు. ఈ పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు మాత్రమే కాదు ఒకే ఒక్క తెలుగు వాడు పాములపర్తి వేంకట నరసింహారావు.

12.అటల్ బిహారీ వాజ్పేయి: (మే 16, 1996 జూన్ 1, 1996)

పీవీ నరసింహారావు తర్వాత ఈయన వచ్చారు. కేవలం 16 రోజులు మాత్రమే ఈయన ప్రధానిగా ఉన్నారు. 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది అటల్ బిహారీ వాజ్పేయి కి.

13.దేవగౌడ: (జూన్ 1, 1996 ఏప్రిల్ 21, 1997)

1996 జూన్ 1 నుండి 1997 ఏప్రిల్ 21 వరకు ఈయన సేవలని అందించారు. దానికి ముందు ఈయన 1994 నుండి 1996 వరకు కర్నాటక రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా సేవలని అందించారు. 16వ లోక్‌సభకు కర్నాటక రాష్ట్రం లోని హసన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.

14.ఐ కె గుజ్రాల్: (ఏప్రిల్ 21, 1997 మార్చి 19, 1998)

1997 నుండి 98 వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. గుజ్రాల్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు కూడా వెళ్లారు.

15.అటల్ బీహారీ వాజపేయి: మార్చి 19, 1998 మే 22, 2004

నేషనల్ హైవే లని నిర్మించారు. అలానే ఎన్నో మంచి వాటికోసం శ్రీకారం చుట్టారు. దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. కార్గిల్ వార్ లో పాకిస్తాన్ తోక కత్తిరించారు. భారత ప్రభుత్వం మార్చిి 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన జన్మిదినం అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వం.

16.మన్మోహన్ సింగ్: (మే 22, 2004 మే 25, 2014)

మన్మోహన్ సింగ్ 2004 నుండి 2014 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. చాలా పథకాలని మన్మోహన్ సింగ్ తీసుకువచ్చారు. అలానే బ్యాంకింగ్ వ్యవస్థని కూడా బలోపదం చేశారు.

17.నరేంద్ర మోడీ: 

2014 నుండి ఇంకా ప్రధానిగా కొనసాగుతున్నారు. మోడీ మన దేశ కీర్తిని నలుమూలల చాటుతున్నారు. 2014 మే 26న నరేంద్ర మోదీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలానె ఈయన పలు నిర్ణయాలు, విధి విధానాలు అమలు చేసారు. 500, 1000, 2000 రూపాయల నోట్ల రద్దు చేసారు. అధికరణ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, పారసత్వం సవరణ చట్టం (CAA), జీఎస్టీ అమలు ఇలాంటివి ఎన్నో చేసారు.

Previous articleటాలీవుడ్ లో విలన్ గా అడుగు పెట్టి, ఆ తరువాత స్టార్ హీరోలు మారినవారు.. వీళ్ళే..!
Next articleఅందరినీ నవ్వించే జబర్దస్త్ ”పవిత్ర” లైఫ్ లో ఇన్ని కష్టాలా..? వీడియో వైరల్..!