Ads
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ఇటీవల విడుదలై రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో ఒక విలన్ గా బాబీ సింహా నటించి, ఆకట్టుకున్నాడు. అయితే ఆయన ఇంతకు ముందు కొన్ని తెలుగు సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ ని పలకరించారు. కానీ ఆయన గురించి ఆడియన్స్ కి ఎక్కువగా తెలియదు.
Ads
తమిళ సినిమాలలో విభిన్నమైన క్యారెక్టర్స్ లో నటించి, తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను ఏర్పరుచుకున్న హీరో. కోలీవుడ్ లో విలన్ గా, హీరోగా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తున్నారు. తమిళంలో వచ్చిన ‘జిగర్తాండ’ అనే చిత్రంలో అద్భుతమైన నటనకు బాబీ సింహాకి ఉత్తమ సహాయ నటుడిగా నేషనల్ అవార్డు వచ్చింది. ఇదే సినిమాని తెలుగులో ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ రీమేక్ చేసాడు. ఆ సినిమానే ‘గద్దలకొండ గణేష్’. తమిళంలో బాబీ సింహా చేసిన క్యారక్టర్ ని తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసాడు. ఆ సినిమా తెలుగులో కూడా హిట్ అయ్యింది.ఇక జాతీయ అవార్డును పొందిన బాబీ సింహా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూద్దాం. నటుడు బాబీ సింహా చెప్పడానికే తమిళ నటుడు. కానీ ఆయన ఏపీలోని కృష్ణా జిల్లాకి చెందిన వ్యక్తి అని ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి చెప్తే కానీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. బాబీ సింహా 1983లో హైదరాబాద్ లోని మౌలాలిలో నవంబర్ 9వ తేదీన జన్మించాడు. ఇక ఆయన సొంతూరు విజయవాడ దగ్గరలో ఉన్న బందర్. ఆయన 4వ తరగతి వరకు మౌలాలిలో చదువుకున్నారు. ఆ తరువాత కృష్ణ జిల్లాలోని ప్రియదర్శిని విద్యాలయంలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. డిగ్రీ కోయంబత్తూరులో చేశాడు.చిన్నతనం నుండే సినిమాల పట్ల ఇష్టం పెంచుకున్న బాబీ సింహా, ఇండస్ట్రీలో అవకాశాల కోసం అందరి లానే చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. ఎన్నో ఆడిషన్స్ కి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడే ఒకరోజు ‘కదలిల్ సోదప్పువదు ఎప్పడి’ అనే మూవీకి సెలెక్ట్ అయ్యాడు. ఇక మొదటి చిత్రంతోనే నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ వెంటనే లవ్ ఫెయిల్యూర్, పిజ్జా లాంటి సినిమాలలో అవకాశం వచ్చింది. ఇక అలా మొదలైన ఆయన కెరీర్ 2014లో వచ్చిన ‘జిగర్తాండా’ చిత్రంతో టర్న్ అయ్యింది. నేషనల్ స్థాయిలో నటుడిగా గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత సంవత్సరానికి 10 చిత్రాలు చేస్తూ దక్షణాదిలో క్యారక్టర్ ఆర్టిస్టుగా బిజీగా బిజీగా కొనసాగుతున్నాడు.
Also Read: అనసూయ భరద్వాజ్ ల ప్రేమ కథ మీకు తెలుసా..?