అచ్చం సౌంద‌ర్య‌లాగే ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

Ads

మనుషులను పోలిన మనుషులు ఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే. ఎప్పుడైనా ఎక్కడైనా కొత్త వ్యక్తులను చూసినప్పుడు కొన్ని సార్లు వీళ్లను ఎక్కడో చూసినట్టు ఉందనే మనలో చాలా మందికి అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది.

Ads

ఇక సోషల్ మీడియా వచ్చాక స్టార్ హీరోలు,స్టార్ క్రికెటర్లు, స్టార్ హీరోయిన్లను పోలికనట్టు ఉండే వ్యక్తుల ఫోటోలు, వీడియోలు ఇప్పటికే చాలాసార్లు వైరల్ అవడం చూస్తూనే ఉన్నాము. అయితే ప్రస్తుతం సామాజిక మధ్యమాలలో దివంగత నటి సౌందర్యను పోలీనటువంటి ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. హీరోయిన్ సౌందర్య కన్నడ అమ్మాయి అయినా, తెలుగు ఆడియెన్స్ మనసులను గెలుచుకున్నారు.
సౌందర్య మనవరాలి పెళ్లి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక అందం కూడా అసూయపడే అంత అందంగా ఉండడమే కాక తన సహాజమైన నటనతో ప్రేక్షకుల హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయి నటిగా గుర్తింపును తెచ్చుకున్నారు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ఆమె 100కు పైగా చిత్రాలలో నటించారు. సౌందర్య ఒకవైపు అగ్ర హీరోలతో నటిస్తూ, మరోవైపు ఇండస్ట్రీలోని చిన్న హీరోలతో కూడా నటించి, మెప్పించారు.సౌందర్య కెరీర్ లో టాప్ ప్లేస్ లో ఉండగానే ఒక విమాన ప్రమాదంలో మరణించారు. ఆమె మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆమె మరణించి ఎన్నో ఏళ్లు అయినప్పటికి ఈ రోజుకి ఆమె రూపం ఆడియెన్స్ మనసులలో నిలిచిపోయింది. అలాంటి సౌందర్యను పోలిన ఫోటోలు మరియు వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలలో ఉన్నది మలేసియాకు చెందిన ఓ అమ్మాయి. చూస్తే అచ్చం సౌందర్య మళ్ళీ పుట్టిందా అన్నట్టుగా ఉంది. ఆ అమ్మాయి పేరు చిత్ర. ఆమె ఒక ఎంటర్ ప్రెన్యూర్. మలేసియాలో సెటిల్ అయిన భారత సంతతి అమ్మాయి. ఇక సౌందర్యలా కనిపించే చిత్ర, నటి సౌందర్య చిత్రాల్లోని పాటలు, డైలాగులు, సన్నివేశాలతో వీడియోలు చేస్తూ టిక్ టాక్ లో స్టార్ డమ్ ని సంపాదించుకుంది. వాటి ద్వారా తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది.

Also read: హీరోలు చిరంజీవి, బాలయ్య, హీరోయిన్ రాధ.. ఈ ముగ్గురి లైఫ్ లో ఉన్న పోలిక ఏమిటో తెలుసా..?

 

Previous articleవీర సింహారెడ్డి సినిమాలో మొదట అనుకున్నది వరలక్ష్మిని కాదట.. మరి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Next articleవాల్తేరు వీరయ్య సినిమాలోని విలన్ బాబీ సింహా బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.