వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలలో సంక్రాంతి బరిలో గెలిచే మూవీ ఏది?

Ads

తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి పండుగ సినిమాలు విడుదల చేయడానికి అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఈ పండక్కి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, చిన్న పెద్ద సినిమా అనే తేడా లేకుండా సినిమాలు భారీ కలెక్షన్స్ ని వసుల్ చేస్తాయి.

Ads

అందువల్లే మేకర్స్ ప్రతి ఏడాది ఈ పండక్కి పోటీ ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. ఇక రాబోయే సంక్రాంతికి కూడా చాలా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. అయితే గత రెండు సంవత్సరాలుగా సంక్రాంతి సమయంలో సినిమా పోటీ ఎక్కువగా కనిపించలేదు. కరోనా నేపథ్యంలో పెద్ద సినిమాలు పోటీ పడలేదు. అయితే వచ్చే సంక్రాంతికి మాత్రం బాక్సాఫీస్ అతిపెద్ద వార్ కి రెడీ అవుతుందని సమాచారం. ఇక ఈ సంక్రాంతి పండగా రేస్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ ‘వీర సింహ రెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు ఉన్నాయి.
చాలా ఏళ్ల తరువాత ఈ అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండడంతో సినీ అభిమానులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణలు సంక్రాంతికి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు తలపడ్డారు. వాటిలో నాలుగు సార్లు చిరంజీవి, మూడు సార్లు బాలకృష్ణ విజయం సాధించారు. ఇంకో రెండు సార్లు ఇద్దరి సినిమాలు విజయం సాధించాయి. ఇది పదవ సారి. ఈ సారి ఇద్దరు తమకు హిట్స్ ఇచ్చిన జానర్ లోనే వస్తున్నారు. చిరంజీవి మాస్ లుక్ లో ఉండగా, బాలకృష్ణ ఫ్యాక్షనిజం నేపథ్యంలో వస్తున్నారు.
ఇప్పటికీ అయితే సంగీత పరంగా చిరంజీవి ముందున్నా, బాలకృష్ణ వీర సింహ రెడ్డి సినిమాకే పాజిటివ్ రేట్ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ అఖండ సినిమా ఇచ్చిన జోష్ లో ఉండగా, మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా కమర్షియల్ గా విజయం పొందంకపోవడంతో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు.
అయితే మైత్రి మూవీ మేకర్స్ ఈ రెండు సినిమాలను నిర్మించారు. అయితే ప్రమోషన్స్ పెద్దగా చేయడం లేదు. ఇక ఈ రెండు సినిమాలలో ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి మరి. ఈసారి సంక్రాంతి రేస్ లో కోలీవుడ్ హీరో విజయ్ వారసుడు సినిమా కూడా ఉంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రమోషన్స్ చాలా స్పీడ్ గా చేస్తూ, ఈ మూవీ పై బజ్ ని పెంచుకుంటున్నారు.

Also Read: ఈ 14 మంది హాస్యనటుల భార్యలు ఎంత అందంగా ఉన్నారో ఎప్పుడైనా చూసారా?

Previous articleగోవిందుడు అందరివాడేలే మూవీలోని రామ్ చరణ్ చెల్లెలు ప్రస్తుతం ఎలా ఉందో? ఏం చేస్తుందో తెలుసా..?
Next articleకళ్యాణ్ దేవ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. దాని గురించేనా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.